డిపాజిట్ గల్లంతుపై వివరణ ఇచ్చిన కాంగ్రెస్

హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఇంత దారుణంగా, డిపాజిట్ కోల్పోయేటంత స్థాయిలో ఓడిపోతామని ఆ పార్టీ నేతలు ఎవరూ ఊహించలేదు. ఓటమి షాక్ నుంచి ఒకరొకరుగా తేరుకుంటున్న కాంగ్రెస్ నేతలు బయటకొచ్చి ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఓటర్లు భయంతోనే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. వరంగల్‌లో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని చెప్పారు. ఓటువేయకపోతే సంక్షేమ పథకాలను ఆగిపోతాయని టీఆర్ఎస్ నేతలు బెదిరించారని అన్నారు. ప్రశ్నించిన వారిని జైళ్ళలో పెడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పారు. వరంగల్ విజయంతో ప్రజలు తమవైపే ఉన్నారని తేలిందంటున్న కేసీఆర్, టీఆర్ఎస్‌లోకి పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులందరితో రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలు జరపాలని సవాల్ విసిరారు. తమ సవాల్‌ను కేసీఆర్ స్వీకరిస్తారనే భావిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు వరంగల్ ఫలితంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెస్ ప్రచారాన్ని వరంగల్ ప్రజలు నమ్మలేదని అన్నారు. ఓటమికి సమష్ఠి బాధ్యత వహిస్తామని చెప్పారు. ఓటమిని విశ్లేషించుకుని ముందుకు వెళతామని అన్నారు. 2019లో ఎలాంటి రాజకీయ పొత్తులైనా ఉండొచ్చని, వాటిని గురించి ఇప్పుడే మాట్లాడటం అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ క్యాడర్ ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మెచ్చేవిధంగా పనిచేయాలని కోరారు. వరంగల్ ప్రచారంలో టీఆర్ఎస్‌కు తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని, మూడేళ్ళలో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతాంగానికి నీళ్ళిస్తే టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తానని జానారెడ్డి అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close