తెలంగాణ‌లో భాజ‌పా ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ టెన్ష‌న్‌..!

దేశ‌మంతా ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల హ‌డావుడిలో ఉంది. తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే… అంద‌రి ఫోక‌స్ ఆంధ్రా ఫ‌లితాల‌పైనే ఉంది. తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రిగినా కూడా తెరాస‌కే అత్య‌ధిక స్థానాలు వస్తాయ‌న్న ఒక న‌మ్మ‌కంతో, ఇక్క‌డి ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఏమంత ఆస‌క్తి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు! అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌పై టీ కాంగ్రెస్ లో కొంత చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రీ ముఖ్యంగా, రాష్ట్రంలో భాజ‌పా ఓటు బ్యాంకు పెరిగే అవ‌కాశాల‌పై చ‌ర్చ జ‌రుగుతుండ‌టం విశేషం!

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత‌, లోక్ స‌భ ఎన్నిక‌ల్ని కూడా కాంగ్రెస్ కాస్త ఉదాసీన వైఖ‌రితోనే ఎదుర్కొంద‌ని అన‌డంలో సందేహం లేదు. దీంతో కొన్ని స్థానాల్లో భాజ‌పాకి అనూహ్యంగా ఓటు బ్యాంకు పెరిగే అవ‌కాశాలున్న‌ట్టుగా కాంగ్రెస్‌ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌! మ‌హబూబ్ న‌గ‌ర్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌… ఈ నాలుగు స్థానాల్లో తెరాస‌కు గ‌ట్టి పోటీని భాజ‌పా ఇచ్చింద‌నే అభిప్రాయం కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మౌతోంది! ఈ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా… మూడో స్థానానికి ప‌రిమితం కావొచ్చ‌నే అంచ‌నాలున్నాయ‌ట‌. వీటిలో కొన్ని భాజ‌పా గెలుచుకునే అవ‌కాశం ఉంద‌నీ, ఒక‌వేళ ఓడిపోయినా రెండో స్థానంలో నిలిచేలా ఉంద‌నే లెక్క‌లు కాంగ్రెస్ నేత‌లు వేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. వీటితోపాటు, మ‌రో ఐదు స్థానాల్లో కూడా భాజ‌పా గెల‌వ‌క‌పోయినా… ఓటు బ్యాంకును పెంచుకునేలా ఉంద‌ట‌! ఖ‌మ్మం, న‌ల్గొండ‌, భువ‌న‌గిరి, మ‌ల్కాజ్ గిరి, చేవెళ్ల‌…. ఈ స్థానాల్లో తెరాసకు కాంగ్రెస్ బ‌ల‌మైన పోటీ ఇచ్చింద‌నీ, కానీ భాజ‌పా కూడా గ‌తంతో పోల్చుకుంటే కొంతమేర‌ ఓటు బ్యాంకును పెంచుకుంద‌నేది టి. కాంగ్రెస్ వ‌ర్గాల అంచ‌నాగా తెలుస్తోంది.

కాంగ్రెస్ అంచ‌నా వేస్తున్న‌ట్టుగా ఆ నాలుగు స్థానాల్లో కొన్నైనా భాజ‌పా గెలిచినా గెల‌వ‌క‌పోయినా… రెండో స్థానంలోకి రావ‌డమంటే ఆ పార్టీకి తెలంగాణ‌లో విజ‌య‌మ‌నే చెప్పాలి! దాంతోపాటు, రాష్ట్రంలో కొంత ఓటు శాతం ద‌క్కించుకోగ‌లిగింది అంటే… కాంగ్రెస్ పార్టీకి స‌వాలుగానే మారుతుంది. ఒక‌వేళ‌, కేంద్రంలో మ‌రోసారి మోడీ స‌ర్కారు వ‌స్తే… తెలంగాణ‌లో కాస్త‌ పెరిగిన ఈ ఓటింగ్ శాతం, రాబోయే రోజుల్లో ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఎదిగేందుకు కావాల్సిన వేదిక భాజ‌పాకి సిద్ధ‌మైన‌ట్టే అవుతుంది. పైగా, తెలంగాణ‌లో తెరాస‌కు ధీటైన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించే స్థాయిలో కాంగ్రెస్ క‌నిపించ‌డం లేదు. ఆ స్థాయిలో పోరాడితే త‌ప్ప‌, పార్టీని కాపాడుకోలేమనే ఐక‌మ‌త్య‌మూ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య లేదు. ఈ ప‌రిస్థితుల‌ను భాజ‌పా అనుకూలంగా మార్చుకునే అవకాశాలు చాలా స్ప‌ష్టంగా ఉన్న‌ట్టుగానే చెప్పాలి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close