మద్యం డోర్ డెలివరీ పరిశీలించాలని “సుప్రీం” సలహా..!

కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాల్ని ప్రారంభించాయి. మద్యం దుకాణాల దగ్గర ఎవరూ.. భౌతిక దూరం..మాస్కులు లాంటివి పెట్టుకోకుండానే… గుంపులు, గుంపులుగా మద్యం కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో మద్యం అమ్మకాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని.. తక్షణం మద్యం అమ్మకాల్ని నిలిపివేయాలని కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు డోర్ డెలివరీ సలహా ఇచ్చింది. భౌతికదూరం అమలు చేసేందుకు డోర్‌ డెలివరీని పరిశీలించాలని సూచించింది.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మద్యం డోర్‌ డెలివరీ చేస్తున్నారని.. సుప్రీంకోర్టు గుర్తు చేసింది. కరోనా వైరస్ కారణంగా అన్ని రాష్ట్రాల్లో నలభై రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు పడ్డాయి. చివరికి కేంద్రం… నలబై రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. కేంద్రం అనుమతించిన ఒక్క రోజేనే మెజార్టీ రాష్ట్రాలు అమ్మకాలు ప్రారంభించాయి.

నలభై రోజుల తర్వాత అమ్మకాలు ప్రారంభించడంతో.. మొదటి రోజు.. అందరూ ఎగబడ్డారు కానీ… తర్వాత చాలా చోట్ల మామూలుగానే పరిస్థితి మారింది. వందల మంది ఏమీ దుకాణాల ముందు ఉండటం లేదు. అయితే.. తొలి రోజుల్లో రష్ చూసిన తర్వాత పిటిషనర్లు కోర్టుల్లో కేసు వేసి ఉంటారు. డోర్ డెలివరి సలహా సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి… అమలు చేయాలా వద్దా అన్నది రాష్ట్రాల నిర్ణయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close