రాజకీయ అవినీతే వల్లే ఇంటర్ గందరగోళం..! గ్లోబరీనా వెనుక ఉన్నదెవరు..?

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకున్నాయి. కొన్ని వేల మంది విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. కష్టపడినా పాస్ కాలేకపోయామన్న బాధతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు.. అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కానీ ఇంటర్ బోర్డు మాత్రం… ఏమైనా డౌట్స్ ఉంటే… రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ చేయించుకోవాలని సలహాలిస్తోంది. నవ్య అనే విద్యార్థినికి 99 మార్కులు వస్తే సున్నా వేశారు. పేద కుటుంబానికి చెందిన నవ్య తన భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలన్నీ… కళ్ల ముందే కుప్పకూలిపోతున్న పరిస్థితి వచ్చేసింది. ఎలాగోలా లెక్క తేలింది. ధైర్యం లేని పిల్లల సంగతేమిటి..? 99 మార్కులు వచ్చిన విద్యార్థినికి సున్నా మార్కులు వేసేంత తప్పు ఎక్కడ జరిగింది..? దీనికి బాధ్యులెవరు..?

ఒక్క నవ్య మాత్రమే ఇబ్బంది పడలేదు. ఇలాంటి తప్పుల వల్ల అన్యాయమైపోయిన వారు… వేల సంఖ్యలో ఉన్నారని.. ఒక్కొక్క ఘటన బయటకు వస్తోంది. రెండేళ్లు కష్టపడితే… ఫెయిలవడం ఏమిటన్న ఆత్మన్యూనతతో.. ఇప్పటికే పదహారు మంది విద్యార్థులు ప్రాణం తీసుకున్నారు. తప్పులు దొర్లినట్లు స్పష్టమవుతున్నా… సంబంధిత యంత్రాగం నుంచి వస్తున్న స్పందన.. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి ేచస్తోంది. వారివి అపోహలేనని తేల్చి పడేస్తున్నారు. డౌట్ ఉంటే.. రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ చేయించుకోవాలని ఉచిత సలహాలిస్తున్నారు. తప్పంతా.. ఇంటర్ బోర్డులోనే జరిగిందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంటర్ బోర్డు… అసలేమీ జరగలేదని వాదిస్తోంది. ఇలాంటి వాదించే బదులు..తప్పులు జరగలేదని… నిరూపించడానికి ప్రయత్నించాలి కానీ…. చేయడం లేదు.

గ్లోబరీనా అనే సంస్థ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఆ సంస్థ పని తీరు ఏ మాత్రం బాగోలేకపోయినా… ఆ సంస్థకు సామర్థ్యం లేకపోయినా.. రూ. ఐదు కోట్లు ఇచ్చి మరీ సేవలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఆ ఐదు కోట్లలో… కాంట్రాక్ట్ ఇచ్చేందుకు సహకరించిన రాజకీయ నేతకు.. ఎక్కువ భాగం వెళ్లాయని చెబుతున్నారు. రాజకీయ అవినీతి వల్లే.. ఆ సంస్థకు… విద్యార్థుల భవిష్యత్ ను అప్పగించారు. ఇప్పుడా సంస్థ మొత్తానికే మోసం చేసింది. ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు..? గ్లోబరీనా వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలెవరు..? ఈ రాజకీయ అవినీతికి శిక్ష ఉండదా..?. ఉద్యోగులు అవినీతి పరులు అని ముద్ర వేసేందుకు అదే పనిగా శ్రమిస్తున్న వారు..ఈ రాజకీయ అవినీతిపై చర్యలు తీసుకోరా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com