కాంట్రాక్టు సొమ్ములివ్వని స్వర్ణభారతి ట్రస్ట్- విరాళంపై ఒత్తిడి

కేంద్రమంత్రి, బిజెపి సీనియర్‌ నాయకుడు వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణభారతి ట్రస్టు కోసం భవన నిర్మాణం చేయించుకుని బిల్లు చెల్లించకుండా రెండున్నరేళ్లుగా తిప్పించుకుంటున్నట్టు పాలడుగు సత్యనారాయణ అనే కాంట్రాక్టరు ఫిర్యాదు చేశారు. విలేకరులకు కూడా ఈ వివరాలు తెలియజేశారు. ఉయ్యూరు మండటం ముదునూరుకు చెందిన సత్యనారాయణ ట్రస్టుకోసం మొదట రు,30 లక్షల వ్యయంతో రహదారి వేస్తే బిల్లు సక్రమంగానే చెల్లించారట. తర్వాత భవన నిర్మాణ బాధ్యత అప్పగించగా రు21 లక్షల ఖర్చుతో నిర్మించానని అయితే 17.60 లక్షలు మాత్రమే అయినట్టు లెక్కలు వేయించి అది కూడా చెల్లించడం లేదని ఆయన వివరించారు. దీనిపై గట్టిగా అడిగితే విరాళంగా ఇచ్చినట్టు భావించాలని వొత్తిడి చేస్తున్నారని అయితే తాను చిన్న రైతును మాత్రమేనని సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. అవసరమైతే దీనిపై భవనం ఎదుట నిరాహారదీక్ష చేస్తానన్నారు.

ఇది ఇలా వుంటే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్వర్ణభారతి ట్రస్టు అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ప్రధానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసినా స్పందించలేదు గనక కేంద్రానికి రాసినట్టు తెలిపారు. క్విడ్‌ ప్రోకో తరహాలో వెంకయ్యనాయుడు తన పలుకుబడిని ఉపయోగించి ట్రస్టుకు ప్రయోజనం కలిగిస్తున్నారని రామకృష్ట ఆరోపించారు. కొద్దిభూమిని కోనుగోలు చేసి పక్కనే వున్న ప్రభుత్వ భూమిని శిఖం భూమిని కూడా కలిపేసుకోవడం ఒక వ్యూహంగా చేస్తున్నారని ఆరోపించారు. కన్నా నరసింహరావు అనే రైతుకు చెందిన 30 సెంట్ల భూమిని ఖాళీ చేయవలసిందిగా ట్రస్టు సభ్యులు వేధిస్తున్నారని రామకృష్ణ తెలిపారు. ప్రధాని మోడీ ఈ విషయమై విచారణకు ఆదేశించకపోతే తాము ఆందోళన చేయవలసి వుంటుందని కూడా ప్రకటించారు. గతంలోనే ఈ ట్రస్టుపై పలు విమర్శలు వున్నాయి. ముఖ్యమంత్రలు కేంద్ర మంత్రులు దగ్గరుండి వంతపాడడంతో ప్రభుత్వ కాంట్రాక్టర్లు రియల్టర్లు భారీతానే నిధులు సమకూరుస్తున్నారు.అది చాలనట్టు ఈ విధమైన బలంతపు వసూళ్లు ఒత్తిళ్లు కూడా జరుగుతున్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.గాలి జనార్థనరెడ్డి కూడా ఒకప్పుడు ఈ ట్రస్టుకు సహాయం ఇచ్చిన వారేనట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close