చైతన్య : సినిమాకు వెళ్తే కేసులెందుకు..? దేశంలో ఇదేం అసహనం..?

సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్రదర్శించడం ఇప్పుడు నిర్బంధంలా మారింది. అలా వెళ్లిన ప్రతి ఒక్కరూ.. కచ్చితంగా జాతీయగీతం సందర్భంగా లేచి నిలబడాలి. ఏ కారణం చేత అయినా నిలబడకపోతే.. అతి పక్కన నోటి దురద .. లేకపోతే చేతి దురద ఉన్న వారికి అలుసుగా మారిపోతోంది. తిట్టడమో.. దాడిచేయడమో.. తమ జన్మహక్కు అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. వారికి ఎందుకింత స్వేచ్ఛ వచ్చింది..? జాతీయ గీతం వచ్చేటప్పుడు లేచి నిలబడకపోతే దేశభక్తి లేనట్లేనా..?

దేశభక్తికి కొలమానం సినిమా ధియేటర్లలో ఉందా..?

కార్తీక్ ప్రసాద్‌పై అనే వ్యక్తిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు కేసేమిటంటే.. ఓ మల్టిప్లెక్స్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన కార్తీక్ ప్రసాద్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఆ సమయంలో జాతీయ గీతం వచ్చింది. లేచి నిలబడలేదు. దాంతో.. ఆయనకు దేశభక్తి తక్కువయిందని.. పక్కనునన మరో అపర దేశభక్తుడు.. దాడి చేసినంత పని చేసి దుర్భాషలాడారు. ఇద్దరి మధ్య అది గొడవకు దారి తీసింది. చివరికి అది కేసయింది.

సుప్రీంకోర్టు వద్దని చెప్పినా సినీ ప్రేక్షకులను ఎందుకు వదలడం లేదు..?

అసలు సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించడం అనేది తప్పనిసరి కాదు. అది ధియేటర్ల ఇష్టం. అలాగే.. జాతీయ గీతం వస్తున్నప్పుడు ప్రేక్షకులు లేచి నిల్చోవాలా లేదా అనేది కూడా వారిష్టమే. వినోదం కోసం జనం సినిమాకు వెళ్తారు. దేశభక్తి పాఠాలు విని.. తమ దేశభక్తిని ప్రదర్శించుకోవడానికి కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాతీయ జెండా, జాతీయ గీతానికి అవమానం అన్న ప్రశ్నే.. అలాంటి సందర్భాల్లో రాదని తేల్చి చెప్పింది. జాతీయగీతం పాడి తీరాల్సిందేననడానికి ఎలాంటి చట్టపరమైన నిబంధన లేదు, జాతీయ గీతాలాపనపై కేంద్రప్రభుత్వం ఒక అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. 12 మంది కమిటీని 2017 డిసెంబరులో ఏర్పాటు చేశారు. జాతీయ గీతాలాపనకు మార్గదర్శకాలను ఈ కమిటీ సూచించాల్సి ఉంది. రాష్ట్రప్రభుత్వాల సూచనలను ఆహ్వానిస్తూ ఈ కమిటీ లేఖలు పంపింది. ప్రభుత్వాల నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉంది.

జాతీయ గీతం సినిమాహాళ్లలో ప్రదర్శించడం గౌరవాన్ని తగ్గించడమే..!

52 సెకన్ల నిడివి ఉండే జాతీయ గీతాన్ని పూర్తి స్థాయిలో గానీ, పాక్షికంగా గానీ ఆలాపించేందుకు కొన్ని నియమాలున్నాయి. భారత రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాల్లో ముందుగానూ, చివరిలోనూ జాతీయ గీతం పాడాలి. అప్పుడు అందరూ లేచి నిల్చోవడం ఆనవాయితీగా వస్తోంది. రేడీయోలో రాష్ట్రపతి ప్రసంగం వచ్చినప్పుడు కూడా జాతీయ గీతాన్ని వినిపిస్తారు. ప్రధానమంత్రి ప్రసంగానికి జాతీయ గీతం వర్తించదు. పాఠశాలలు, కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే సహా కొన్ని ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా జాతీయ గీతం పాడతారు. విదేశీ నేతలు భారత్ వచ్చినప్పుడు ఇరు దేశాల జాతీయ గీతాలు వినిపించడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కానీ.. సినిమా ధియేటర్లలో ప్రదర్శించడం… దానికి విధిగా.. ప్రేక్షకులు లేచి నిలబడాలనడం… అలా చేయకపోతే.. దేశద్రోహి అన్నట్లుగా వ్యవహరించడం… ఇప్పుడు కనిపిస్తోంది.

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనషులు..!

రాజకీయాల్లోకి దేశభక్తి కలసిపోయి.. తాము చెప్పింది చేయకపోతే.. దేశభక్తి లేదన్నట్లుగా.. కొంత మంది రాజకీయం చేస్తున్నారు. దాని వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోంది. దేశమంటే.. మంటి కాదు.. దేశమంటే మనుషులనే సంగతిని గుర్తించలేని.. వీరు… సొంతంగా… మోరల్ పోలీసింగ్ చేస్తూ.. ప్రజల్ని వేధిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close