కరోనాలో పది శాతం వాటా సంపాదించిన ఏపీ..!

కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్‌లతో కలిసి మొత్తం కేసులు ఐదు లక్షలు దాటిపోయాయి. మొత్తం కరోనా మృతుల సంఖ్య 4 వేల 487కు చేరింది. ఇటీవలి కాలంలో వైరస్ విజృంభిస్తోంది. గత 10 రోజుల్లోనే లక్షా 13 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. పాజిటివ్‌లతో పాటు మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. పాజిటివిటీ రేటుతో పాటు యాక్టివ్ కేసుల్లో ఏపీ ముందు ఉంది. దేశీయంగా ప్రతి వంద యాక్టివ్ కేసుల్లో 10 మంది ఆంధ్రులే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మంది కరోనా బాధితుల్లో ఒక ఆంధ్రుడు ఉన్నారు.

కరోనా వైరస్ మొదట్లో ఏపీలో అంతగా ప్రభావం చూపలేదు. మెట్రో సిటీలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం… ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత కట్టుదిట్టంగా వైరస్‌ కట్టడి చర్యలు తీసుకోవడంతో.. ఆయా రాష్ట్రాలు బయటపడుతున్నాయి. ఏపీలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. రోజుకు సగటున 8వేల మంది డిశ్చార్జ్‌ అవుతున్నా .. కొత్త కేసులు అంత కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలో నగరాలు, పట్టణాలు దాటి కరోనా పల్లెలకు విస్తరించింది. సరైన అవగాహన లేక పల్లెవాసులు వైరస్ బాధితులు అవుతున్నారు. పల్లెల్లో మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్తరించిన తర్వాతే పాజిటివ్‌ల రేటు పెరుగుతోంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..కరోనా అందరికీ వస్తుందన్న పాలసీని పాటిస్తున్నారు. కేసులు పెరిగిపోతున్నా.. అదే పద్దతి. ఇప్పుడు అసలు కట్టడి చర్యలు దాదాపుగా లేవన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. కరోనా దానంతటకు అది తగ్గితే సరి.. లేకపోతే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close