కేసులున్న ప్రజాప్రతినిధులకు కౌంట్ డౌన్ స్టార్టయినట్లే..!

నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధుల్ని రాజకీయాల నుంచి ఏరివేయాలన్న లక్ష్యంతో సుప్రీంకోర్టు శరవేగంగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అన్ని రాష్ట్రాల హైకోర్టుల నుంచి ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సేకరించి.. సుప్రీంకోర్టుకు సమర్పించారు. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రజాప్రతినిధులపై దేశవ్యాప్తంగా 4859 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏపీలో ప్రజాప్రతినిధులపై 132 కేసులు, తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 143 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది.

హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టులో ఉన్న 17 కేసుల విచారణను 9 నెలల్లో ముగించే అవకాశం ఉందని తెలంగాణ హైకోర్టు సమాచారం ఇచ్చింది. మరో 11 కేసుల్లో సీబీఐ, 5 కేసుల్లో ఈడీ చార్జ్‌షీట్ ఫైల్ చేసిందని… ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులు ప్రతి శనివారం విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించినట్లుగా తెలిపింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ, పురోగతి తెలుసుకునేందుకు.. ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టును ఆదర్శంగా తీసుకొని.. మిగలిన రాష్ట్రాల హైకోర్టులు వెబ్‌సైట్ రూపొందిస్తే బాగుంటుందని అమికస్ క్యూరి సుప్రీంకోర్టుకు సూచించారు. ఏపీ హైకోర్టు కూడా ప్రతి జిల్లాలో ఒక మెజిస్ట్రేట్ కోర్టుని ప్రత్యేక కోర్టు గుర్తిస్తామని తెలిపింది. విశాఖ, కడపలో సెషన్స్ స్థాయి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తామని.. ప్రాధాన్యత క్రమంలో విచారించాలా లేక సాధారణంగానే విచారించాలా.. అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంని ఏపీ హైకోర్టు కోరింది.

సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కీలకమైన సిఫార్సులు చేశారు. సీబీఐ, ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని కేసుల పురోగతిపై.. నివేదిక సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణతో పాటు దర్యాప్తును కూడా..హైకోర్టు పర్యవేక్షించాలని … సాక్ష్యుల రక్షణ కోసం సుప్రీం గతంలో చెప్పిన సాక్షుల సంరక్షణ చట్టం 2018ని అన్ని ప్రత్యేక కోర్టులు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. మంగళవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో కీలకమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close