హైదరాబాద్‌లో మళ్లీ కరోనా ఆంక్షలు..!?

లాక్‌డౌన్ వార్షికోత్సవం జరుపుకుటున్న సమయంలో… మరోసారి ఆంక్షల దిశగా దేశం వెళ్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పటికే కరోనా విజృంభిస్తోంది. ఆయా నగరాల్లో పాక్షికంగా ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అలాంటి ఆంక్షలు విధించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. గతంలోలా కాకుండా ఈ సారి కేసీఆర్ కరోనా గురించి చాలా సీరియస్‌గానే అసెంబ్లీలో మాట్లాడారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఆయన నేరుగా ప్రకటించకపోయినా… పరిస్థితిని బట్టి ఎనిమిదో తరగతి వరకూ స్కూళ్లు మూసేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు.

ఈ అంశంపై ఎప్పుడు కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తే.. అప్పుడు కీలక నిర్ణయాలు ప్రకటించడానికి అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. హైదరాబాద్‌లో పెద్దగా కరోనా కేసులు బయటపడటం లేదు. అయినప్పటికీ.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా జనం ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో కట్టడిచేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఫంక్షన్లు…మాల్స్…సినిమా హాళ్లు వంటి విషయాల్లో ప్రజల హాజరుకు సంబంధించి కొన్ని పరిమితులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..తెలంగాణలో కరోనా ప్రభావం భారీగా లేదని చెప్పుకోవచ్చు. అయితే పలు చోట్ల స్కూళ్లలో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి.

ఇటీవల హైకోర్టు కూడా కరోనా కట్టడికి కొన్ని ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గతంలో లాక్ డౌన్ విధించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ నష్టం వచ్చింది. అలాంటి పరిస్థితిని మళ్లీ ఎవరూ కోరుకోరు. ప్రభుత్వం కూడా కోరుకోదు. కానీ పరిస్థితుల్ని బట్టి… నిర్ణయం తీసుకోక తప్పదు. జన జీవనంపై ఎలాంటి ఆంక్షలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. కానీ కరోనాను ఎదుర్కోవడానికి కొన్ని చర్యలు తీసుకోక తప్పదని అధికారులు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close