నారాయణ ‘చెవి’కి మూడిందంతే!!

రాజకీయాల్లో మహా అయితే పదవికి మూడుతుంది. అంతే తప్ప ‘చెవి’కి మూడడం ఏమిటి అనే సందేహం కలుగుతోంది కదా! అదే మరి సరదా నిండిన కబురు! సీపీఐ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు నారాయణ గారి ‘చెవి’ కి గండం పొంచి ఉన్నదేమో అనే అనుమానాలు పలువురు విశ్లేషకులకు కలుగుతున్నాయి. ఎందుకంటే.. అందరూ తమ తమ పదవుల మీద పందేలు కాస్తూ, సవాళ్లు విసురుకుంటూ ఉంటే.. తనకంటూ వదులుకోవడానికి పదవులేమీ లేవు గనుక.. నారాయణ గారు మాత్రం తన ‘చెవి’ మీద పందెం కాస్తున్నారు.. సవాళ్లు విసురుతున్నారు.

తెరాస సొంత బలంతో గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంటే గనుక.. తాను చెవి కోసుకుంటానంటూ నారాయణ కొత్తగా సవాలు విసిరారు. నిజానికి వామపక్షాలకు గ్రేటర్‌ ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యం లేదు. కాకపోతే.. తమ ఉనికికి ప్రమాదం రాకుండా.. ఉభయ వామపక్షాలు, లోక్‌సత్తా తో కూడా కలిసి కొన్ని డివిజన్లలో మాత్రం పోటీచేస్తున్నాయి.
అయితే నారాయణ తెరాసకు సవాలు విసురుతుండడం విశేషం. గులాబీ జెండా రెపరెపలాడిస్తామని ఆ పార్టీ వారంతా పదేపదే చెబుతోంటే.. ఫక్తు సొంతబలంతో తెరాస మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంటే గనుక.. తాను చెవి కోసుకుంటానంటూ నారాయణ అంటున్నారు. అందుకే ఆయన చెవికి గండం పొంచి ఉన్నదేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్రేటర్‌లో మేయర్‌ పీఠానికి సగానికంటె ఎక్కువ మంది సభ్యుల ఓట్లు రావాలా, చేతులెత్తే పద్ధతిలో.. లార్జెస్ట్‌ పార్టీ బలాన్ని చాటుకుంటే సరిపోతుందా అనే విషయంలో ఇంకా కాస్త సస్పెన్స్‌ ఉంది. చేతులెత్తే పద్ధతిలోనే మేయర్‌ ఎన్నిక ఉంటుందని ఇటీవల విధివిధానాలు వచ్చాయి. ఆ నేపథ్యంలో.. అదే జరిగితే గనుక.. ఎటూ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా తెరాస ఆవిర్భవించే అవకాశాలు ఎక్కువ. అలా వారు గద్దె మీదకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే.. నారాయణ గారు పాపం చెవి కోసుకోవాల్సి వస్తుందేమో.. అని జనం జోకులేసుకుంటున్నారు.

అవునుగానీ.. చెవికోసుకునే పరిస్థితే వస్తే.. ఆయన కళ్లజోడు ఎలా పెట్టుకుంటారు చెప్మా!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close