సిద్ధాంతాన్ని సవరించారా కామ్రేడ్?

పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన పొత్తు పొడిచింది. రెండు కత్తులూ ఒకే ఒరలో ఇమిడాయి. కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు చేతులు కలిపారు. సీట్ల సర్దుబాటుకు సై అన్నారు. ఎవరు ఏ సీటులో పోటీ చేయాలనే దానిపై ఎడతెడని మంతనాలు జరుపుతున్నారు. మమతా బెనర్జీ దెబ్బకు కుదేలైన సీపీఎం, కాంగ్రెస్ విచిత్రంగా పొత్తుకు సిద్ధపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించడం అనే పవిత్ర ఆశయ సాధనకు సీట్ల సర్దుబాటుకు రెడీ అయ్యాయి.

సిద్ధాంతమే ప్రాణంగా భావించే కమ్యూనిస్టులు సంప్రదాయ, మధ్యే వాద పార్టీల పోకడను విమర్శిస్తుంటారు. ఆ పార్టీల్లో సిద్ధాంత నిబద్ధత కంటే అధికారం కోస ఆరాటం, పదవి కోసం ఏంచేసినా తప్పు లేదనే ధోరణిని వామపక్షాలు తూర్పారపడుతుంటాయి. ఏ పార్టీకైనా అధికారమే పరమావధి. ఇందుకు వామపక్షాలు మినహాయింపు కాదని ఇప్పుడు బెంగాల్లో రుజువైంది.

మమతా బెనర్జీ దెబ్బకు కుదేలైన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు కలిసి పోటీ చేయడానికి సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించాలంటే సొంత బలం సరిపోదని ఇద్దరికీ అర్థమైనట్టుంది. అందుకే, అదనపు శక్తి అవసరమని భావించారు. ఇక ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే సర్దుబాటు చర్చలు జోరుగా జరుగుతున్నాయి. కోల్ కతలోని సీపీఎం ఆఫీసులో శుక్రవారం రాత్రి చాలా సేపు చర్చలు జరిగాయి. రాష్ట్రానికి చెందిన సీపీఎం, కాంగ్రెస్ నాయకులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే 12 సీట్లకు సీపీఎం రెండో జాబితాను ప్రకటించడం కాంగ్రెస్ కు కోపం తెప్పించింది. అందులో తాము పోటీ చేయాలనుకున్న సీట్లు కూడా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇలాగైతే కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ తప్పక పోవచ్చని హెచ్చరిస్తున్నారు. అప్పుడు మమత పార్టీకే మేలు కలుగుతుందంటున్నారు.

కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య భీకర యుద్ధం జరిగిన రో్జులను గుర్తు చేసుకుంటే ఈ పొత్తు చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కేరళలో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రాజకీయ వైరం హత్యలకు దారి తీసిన సందర్భాలున్నాయి. అక్కడ ఈ రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు. మిగతావన్నీ నామమాత్రమే. మరి బెంగాల్లో దోస్తీ చేసి కేరళలో కుస్తీ చేస్తామంటే ఆ సీన్ ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది? కేరళ ప్రజలకు ఏం జవాబు చెప్తారు? బెంగాల్లోని కాంగ్రెస్ వాళ్లు చాలా మంచి వాళ్లు, కేరళలోని కాంగ్రెస్ వాళ్లు చెడ్డవాళ్లని చెప్తారా? ఎర్ర జెండా సిద్ధాంతం ఏమైందనే ప్రశ్నకు జవాబు తడుముకుంటారా? కాంగ్రెస్ పరిస్థితి వేరు. అది మధ్యే వాద పార్టీ. ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుంది. అధికారం కోసం ఏదైనా చేస్తుందనే విమర్శలను ఎదుర్కోవడం అలవాటై పోయింది. కొత్తగా పోయేదేమీ లేదు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , కమ్యూనిస్టులు కత్తులు దూసుకోవడం కూడా ఈసారి విచిత్రంగానే కనిపిస్తుంది. అందుకే, వీరి అపవిత్ర పొత్తును కేరళలో కడిగిపారేస్తానంటున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇక్కడ దోస్తీ, అక్కడ కుస్తీ.. ఆ పార్టీల స్వార్థపూరిత వైఖరిని ఎండగడతానని సవాల్ చేస్తున్నారు. కేరళలో మమత ప్రచారం చేస్తూ బెంగాల్ పొత్తును ఎత్తి చూపితే ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close