తెలంగాణలో కేసీఆర్ సహా 118మందిపై కేసులు..!

ప్రజా జీవితంలో ఉన్న నేర చరితుల సంగతి త్వరగా తేల్చాలనుకుంటున్న సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రజా ప్రతినిధుల అంశం విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ.. తెలంగాణ నుండి 118 ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నాయని నివేదిక ఇచ్చారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉంది. ఒక సిట్టింగ్ ఎంపి పై యావజ్జీవ్ శిక్ష పడే కేసు ఉందని తెలిపారు. బీజేపీ నుండి ఆరుగురు, కాంగ్రెస్ నుండి 12 మంది.. ఎంఐఎం నేతలు ఐదుగురు.. టీఆర్ఎస్ నుండి 28 మందిపై కేసులు ఉన్నాయని నివేదిక సమర్పించారు.

ప్రజా ప్రతినధులపై ఉన్న కేసుల విచారణను ఏడాది లోపు పూర్తి చేయాలని 2015లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఇప్పటికే ఆ కేసులు అలాగే ఉన్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. దీనిపై అమికస్ క్యూరీగా విజయ్ హన్సారియాను సుప్రీంకోర్టు నియమించింది. ఆయన పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల కేసుల వివరాలను రాష్ట్రాల వారీగా సుప్రీంకోర్టుకు సమర్పిస్తున్నారు. తర్వాత ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా విచారణ చేయడానికి సుప్రీంకోర్టు ఓ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం ఉంది కానీ.. తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నవారికి మాత్రం.. ఎలాంటి అడ్డంకులు లేవు. దాంతో చట్టంలో ఉన్న వివిధ రకాల లొసుగులను అడ్డం పెట్టుకుని.. నిందితులు విచారణ జరగకుండా చూసుకుంటున్నాని.. ఏళ్ల తరబడి ఆ కేసులు పేరుకుపోతున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది. దీనిపై సుప్రీంకోర్టు ఏడాదిలో విచారణ చేయాలని గతంలో ఆదేశించినా కార్యరూపంలోకి దాల్చలేదు. ఇప్పుడు స్పష్టమైన కార్యాచరణలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభిస్తే.. దేశంలో క్రిమినల్ కేసులున్న నేతలకు గడ్డు కాలమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close