పీపీఏలు సమీక్షిస్తే “ఎన్‌పీఎ”లు అవుతాయంటున్న క్రిసిల్..!

రుణం ఇచ్చే వారికి…. తీసుకునేవారిపై… ఒక్క శాతం అపనమ్మకం ఏర్పడినా… రూపాయి కూడా అప్పు పుట్టదు. ఎందుకంటే.. రుణం ఇచ్చే వారు.. దాన్ని డిఫాల్ట్‌గా మార్చుకోవాలనో.. మారిపోవాలనో కోరుకోరు. అలాంటి చాన్సులు ఉన్నా… తమ రుణం ఉత్పాదక వ్యయానికి కాకుండా.. ఇతర అసరాలకు ఖర్చు పెడుతున్నారని తెలిసినా.. వారు వెనక్కి తగ్గుతారు. ఇలాంటి రిస్క్‌లను అంచనా వేసే రేటింగ్ సంస్థ ” క్రిసిల్ ” .. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల సమీక్షల విషయంలో కీలకమైన ప్రకటన చేసింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న పీపీఏ సమీక్షలతో.. పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతాయని క్రిసిల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బ్యాంకులకు రుణాలు చెల్లించలేకపోతాయని ప్రకటించారు.

ప్రస్తుతం ఈ కంపెనీలు దాదాపు 21వేల కోట్ల రూపాయల వరకు రుణాలు సమీకరించాయని… పీపీఏలను ఏపీ సర్కార్ రద్దు చేస్తే.. ఆ రుణాలన్నీ ఎన్‌పీఏలుగా మారిపోయే ప్రమాదం ఉందని క్రిసిల్ అంచనా. విషయం కోర్టుకు వెళ్తే.. ఇప్పుడల్లా పరిష్కారం అయ్యే ప్రమాదం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. ఓ రకంగా.. క్రిసిల్ లేఖ.. రుణ వితరణ సంస్థలకు ఒక హెచ్చరిక లాంటిదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. భారీ పెట్టుబడులతో… పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. రాజకీయ కారణాలతో రిస్క్‌లో పెట్టుకుని.. మొత్తానికే తేడా తెచ్చుకోవడం ఎందుకున్న భావన… ఆ లేఖతో పారిశ్రామికవేత్తల్లో ప్రారంభమవుతుందంటున్నారు. పారిశ్రామిక రంగాల్లో.. రేటింగ్ సంస్థలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. వాటి సూచనలు, సలహాలు.. అత్యంత ప్రభావితంగా ఉంటాయి. వాటి రేటింగ్‌లు బాగా ఉంటే.. రుణాలు కూడా వస్తాయి. లేకపోతే.. రుణాలు ఇవ్వడానికి అంతర్జాతీయ సంస్థలూ.. వెనుకడుగు వేస్తాయి.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్రిసిల్ కొన్ని సూచనలు చేసింది. పునరుత్పాదక విద్యుత్తు రంగాన్ని పెద్దఎత్తున ప్రభావితం చేసే అంశాలను పరిగణనలోకి తీసుకుని… దీనిపై తగిన విధంగా ముందుకెళ్లాలని సూచించింది. లేకపోతే పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వమే రెండు సార్లు లేఖలు రాస్తే.. పట్టించుకోని ఏపీ సర్కార్.. క్రిసిల్ … లేఖను మాత్రం ఎలా పరిగణనలోకి తీసుకుంటుందన్న అంచనాలు సహజంగానే ప్రజల్లో వస్తాయి. మరి ప్రభుత్వం ఏం చేయనుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close