తెలకపల్లి వ్యూస్: సంక్షోభం రానివ్వని సిపిఎం

శాసనసభ ఎన్నికల సమీక్ష సందర్భంలో ముఖ్యంగా బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు సమస్యపై సిపిఎం కేంద్రకమిటీలో చీలిక వచ్చేస్తుందని వూహాగానాలు నడిచాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆయనకు మాజీ అయిన ప్రకాశ్‌ కరత్‌ ఉభయులూ కేంద్ర కమిటీ సమావేశంలో తీవ్రంగా ఘర్షణ పడనున్నట్టు కథనాలు వచ్చాయి. ఇదే తరహాలో కేరళ బెంగాల్‌ విభాగాలు పరస్పరం వివాదపడనున్నట్టు కూడా వూహాగనాలు నడిచాయి. అయితే సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాక పరిస్థితి చూస్తే అలాటి సంక్షోభం ఛాయలేమీ కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో అవగాహన కుదర్చుకోవడం పార్టీ రాజకీయ ఎత్తుగడల విధానానికి అనుగుణంగా లేదని గతంలోనే పొలిట్‌బ్యూరో బహిరంగంగా ప్రకటించింది. తర్వాత బెంగాల్‌తో సహా ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాలలోనూ సంబంధిత కమిటీలు సమీక్షలు నిర్వహించి నివేదికలు పంపించాయి. వాటిని పరిశీలించి చర్చించిన కేంద్ర కమిటీ కాంగ్రెస్‌తో అవగాహన సరికాదన్న గత ప్రకటనను పునరుద్ఘాటించింది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి పొలిట్‌బ్యూరో బెంగాల్‌ రాష్ట్ర కమిటీ సహకారంతో కృషి చేయాలని నిర్దేశించింది. అదే సమయంలో బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిరంకుశ పాలన నిర్బంధంపై విశాల పోరాటాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. కేరళలో ఘన విజయాన్ని హర్షిస్తూనే తమిళనాడు, అస్సాంలలో కూడా సిపిఎం వామపక్షాలు ఒక్కసీటు కూడా తెచ్చుకోలేకపోయిన పరిస్థితిపై నిరుత్సాహం వ్యక్తం చేసింది. అదే సమయంలో మోడీ ప్రభుత్వ మతతత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ా విమర్శిస్తూ వాటిపై పోరాటానికి పిలుపునిచ్చింది.

ఈ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి మీడియా మొత్తం సిపిఎం కథ ముగిసిపోతుందని దారుణంగా దెబ్బతింటుందని అంచనాలు ప్రకటిస్తూ వచ్చింది కేరళలో బిజెపి బలం ఒక్కసారిగా పెరిగిపోతుందని కనీసం దానివల్ల యుడిఎఫ్‌ మరోసారి గెలిచే అవకాశం వుంటుందని కూడా లెక్కలు వేసింది.ఇవేవీ జరక్కపోగా ఎల్‌డిఎప్‌ ఎన్నడూ లేనంత గొప్ప ఆధిక్యత సాధించింది.బిజెపి ఓటింగు పెరిగినా ఒక్కసీటుకే పరిమితమైంది.యుడిఎప్‌ తుత్తునియలై పోయింది. ఈ ఘన విజయాన్ని గుర్తించేందుకు మనసొప్పక పోగా ా మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్‌ల మధ్య విభేడాలు ప్రజ్వరిల్లుతాయని ఆశపెట్టుకుని కూచుంది.ఈ జోస్యాలన్ని వమ్ము చేస్తూ పినరాయి విజయన్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి గట్టి పాలనా చర్యలు మొదలుపెట్టారు. అచ్చుతానందన్‌నుంచి ఏదో రాబట్టాలని ఎంత ప్రయత్నించినా పలితం లేకపోయింది.

ఈ సమావేశాలకు ముందు నుంచి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలపైనే దృష్టి కేంద్రీకృతమైంది. 294 సీట్లలో 211 గెలుచుకుని తృణమూల్‌ మళ్లీ అధికారంలోకి వచ్చింది.సిపిఎం బలం గత శాసనసభలో కన్నా తగ్గింది. 2015 ఏప్రిల్‌లో విశాఖలో జరిగిన సిపిఎం జాతీయ మహాసభ కాంగ్రెస్‌ బిజెపిలతో ఎన్నికల పొత్తులు సర్దుబాట్లు వుండరాదనే వైఖరి తీసుకున్న నేపథ్యంలో బెంగాల్‌ కమిటీ కాంగ్రెస్‌తో అవగాహనకు రావడం విమర్శలకు దారితీసింది.దారుణమైన ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విమర్శ ఇంకా తీవ్రమైంది కూడా. పొలిట్‌బ్యూరో గతంలోనే ఈ ఒడంబడిక 21ం మహాసభ నిర్దేశానికి అనుగుణంగా లేదని ప్రకటించింది. సహజంగానే సిపిఎం కేంద్ర కమిటీ దాన్ని పునరుద్ఘాటించింది. అదే సమయంలో ఓట్లు వేసిన 2కోట్ల 15 లక్షలమందికి ధన్యవాదాలు తెల్పింది.మళ్లీ వచ్చిన మమతా బెనర్జీ పాలనలో విశృంఖలంగా జరుగుతున్న దాడులను ఐక్యంగా ప్రతిఘటించాలని కోరింది. మరోవైపున పొలిట్‌బ్యూరో పశ్చిమ బెంగాల్‌ కమిటీతో సంప్రదించి జరిగిపోయిన పొరబాటును దిద్దుకోవడానికి తగు చర్యలు తీసుకోవలసి వుంటుందని తెల్పింది. బెంగాల్‌ యూనిట్‌ను సుతిమెత్తగా వదలిపెట్టారనీ, నాయకత్వం మెతక వైఖరి ప్రదర్శించిందని పరిపరివిధాల వ్యాఖ్యలు వచ్చాయి. అసలు కాంగ్రెస్‌తో అవగాహనను స్వంతం చేసుకోకపోవడం లోపమని మరికొందరు విమర్శిస్తూ వచ్చారు. ఆయా విమర్శకుల వాదనలెలా వున్నా సిపిఎం కేంద్ర కమిటీ జరిగిన తప్పిదాన్ని గుర్తించడం, పార్టీ ఐక్యతను కాపాడుకుంటూ దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అనే విధానాన్ని ప్రాటించినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే జరిగిపోయిన పొరబాటును ఆధారం చేసుకుని భవిష్యత్‌ కార్యాచరణ దెబ్బతినేలా వ్యవహరింఎచడం ఎప్పుడూ ఎక్కడా వాస్తవికత అనిపించుకోదు. . సిపిఎంలో విభేడాలు సంక్షోభాలకు దారితీస్తాయని గతంలోనూ చాలా సార్లు కథలు వచ్చాయి. 1979లో ఆనాటి జనసంఫ్‌ు ప్రాబల్యం పెరిగిన జనతా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినప్పుడు గాని, 1996లో జ్యోతిబాసును ప్రధానిని చేయాలనే ప్రతిపాదన విషయంలో గాని,2008 అణుఒప్పందంపై యుపిఎకు మద్దతు ఉపసంహరించినప్పుడు గాని రకరకాల అభిప్రాయాలు వాదనలు జరిగాయి. వాటి ఆధారంగా సిపిఎం అనైక్యతను లోనవుతుందనే కథనాలు ప్రచారంలో పెట్టారు. కాని ఇంతకాలంలోనూ ఏకీకృత విధానంతో ముందుకు పోవడం, తప్పులు జరిగితే సవరించుకోవడం తప్ప అంతర్గత కుమ్ములాటలకు సిపిఎం గురికాలేదు. ఇప్పుడు కూడా . కేంద్ర కమిటీ వైఖరి ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్‌తో ఇకపై పొత్తు వుండదా అని విలేకరులు ప్రశ్నించారు. సమీపంలో ఎన్నికలే లేనప్పుడు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని సీతారాం ఏచూరి జవాబిచ్చారు. తృణమూల్‌ దుర్మార్గాలపై పోరాటంలో కాంగ్రెస్‌ వారిని కలుపుకొని వెళతారా అన్నప్పుడు ప్రతిఘటనకు సంబంధించిన కార్యాచరణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే కేంద్ర కమిటీ సభ్యురాలు జగతి సంగ్వాన్‌ బహిష్కరణకు దారితీసిన పరిస్థితులపై కూడా ఆయన సమగ్రమైన సమాధానమే ఇచ్చారు. ఎజెండాలలో లేని అంశంపై చర్చకు పట్టుపట్టి అడ్డుతగిలిన ఆమె పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నానని ప్రకటించి బయిటకు రావలసిన అవసరమేమిలో అర్థం కాలేదన్నారు. అత్యున్నత స్థాయి కమిటీ సభ్యులైన వారు ఇలా చేసిన తర్వాత క్రమశిక్షణ చర్య అనివార్యమేనని అందరికీ తెలుసు. తర్వాత కూడా ఆమె ఫేస్‌బుక్‌లో తన వాదనతో లేఖ రాయడం చూస్తే ధోరణి మారలేదని అర్థమవుతున్నది. . ఇష్టానుసారం మాట్టాడి వ్యక్తిగతం అనడం బిజెపిలో చెల్లుతుంది గాని సిపిఎంలో కుదరదు.

ఏది ఏమైనా ఇప్పుడు పరిశీలించి చూస్తే సిపిఎంలో ఎలాటి రాజకీయ సంక్షోభం రాలేదన్నది నిజం. సమస్యలపై కార్యాచరణకు సిద్ధం కావడం వాస్తవం. ఆ మేరకు కమ్యూనిస్టుల అభిమానులంతా సంతోషిస్తారు. ఎందుకంటే దేశంలో పెద్ద కమ్యూనిస్టుపార్టీగా సిపిఎం గట్టిగా వుంటేనే వామపక్ష ఐక్యతకు బలం వుంటుందని అందరికీ తెలుసు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close