సుభాష్  : పవన్ సినిమాలపై విమర్శలు ఆయన స్వయంకృతమే..!

పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంత వరకూ.. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన ఏ ఒక్కరూ కూడా.. నటనను వదిలి పెట్టలేదు. వదిలి పెట్టలేరు కూడా. ఎందుకంటే.. గ్లామర్ ఫీల్డ్ కు ఉన్న ఆకర్షణ అలాంటిది. చాలా మంది.. ఇలా రాజకీయాల్లోకి వెళ్లి నటనను కొనసాగించారు. ఎవరిపైనా విమర్శలు రాలేదు. మొదటి సారి పవన్ కల్యాణ్ నటిస్తూంటే మాత్రం విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం పవన్ కల్యాణే. ఎందుకంటే.. పవన్ కల్యాణ్.. తాను ఇక సినిమాల్లో నటించబోనని పలుమార్లు ప్రకటించారు. అందుకే.. గతంలో సినిమాలు చేయబోనని ప్రకటించి.. ఇప్పుడెందుకు చేస్తున్నారన్న విమర్శలు రావడానికి కారణం అవుతోంది.

కొన్ని సందర్భాల్లో .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చక్కగా పరిపాలిస్తే.. తానెందుకు రోడ్ల మీదకు వస్తానని.. చక్కగా వెళ్లి సినిమాలు చేసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు ఆయన సినిమాలు చేసుకుంటూంటే.. తాము బాగా పరిపాలిస్తున్నామనే కదా అర్థం అని వైసీపీ నేతలు అంటున్నారు. రాజకీయ నేతలు సందర్భానికి తగ్గట్లుగా అభిప్రాయాలు మార్చకుంటారు . కానీ ఒక్క దానికి ఎప్పుడూ స్టిక్ అవకూడదు. ఎస్కేప్‌కి ఓ మార్గం ఉంచుకుంటారు. కానీ పవన్ కల్యాణ్‌కు మాత్రం.. అలాంటి రాజకీయం వంట బట్టలేదు.

తాను సీరియస్ పొలిటీషియన్‌ను అని చెప్పుకోవడానికి పవన్ కల్యాణ్ .. ఇక సినిమాలు చేయబోనని ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు. ఆయన సినిమాల్లో నటించకుండా పూర్తిగా రిటైర్మెంట్ తీసుకోవడం అసాధ్యమని.. చాలా మంది నమ్మకం. ఇప్పుడు అది నిజమవుతోంది. కానీ ఆయన చేసిన ప్రకటనల వల్ల ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడానికి వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. రాజకీయ కారణాలు ఉండొచ్చు. అసలే కారణం ఉండకపోవచ్చు. కానీ ఆయన పని ఆయన చేసుకోవడాన్ని విమర్శించడం మాత్రం..విజ్ఞత అనిపించుకోదనేది చాలా మంది మాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close