నిర్మాత‌లకు ‘క్యూబ్‌’ క‌ష్టాలు

ఓ హిట్టు సినిమా తీసిన ఆనందం కూడా నిర్మాత‌కు ద‌క్క‌డం లేదు. సినిమా హిట్ట‌యితే జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్తారు. నాలుగు డ‌బ్బులొస్తాయి. కానీ… మ‌ధ్య‌లో ఎన్ని అవాంత‌రాలో. పైర‌సీ వ‌ల్ల నిర్మాత బాగా న‌ష్ట‌పోతున్నాడు. మ‌ల్టీప్లెక్స్ లో సినిమా రాను రాను భారం అయిపోతోంది. థియేట‌ర్‌కి వెళ్లి సినిమా చూడ్డానికి ప్రేక్ష‌కుడు బ‌ద్ద‌కిస్తున్నాడు. అలా.. క‌ష్టాల మీద క‌ష్టాలు. వాటికి తోడు ఇప్పుడు ‘క్యూబ్‌’ క‌ష్టాలు తోడ‌య్యాయి.

సెల‌బ్రెటీలు, స్టార్లు, రాజ‌కీయ వేత్త‌లు ఇప్పుడు థియేట‌ర్‌కి వెళ్ల‌డం లేదు. ఎంచ‌క్కా ఇంట్లోనే ఓ హోం థియేట‌ర్ పెట్టుకుంటున్నారు. దానికి శాటిలైట్‌తో క‌న‌క్ష‌న్ ఉంటుంది. ప్ర‌తీ సినిమాకీ ఓ శాటిలైట్ కోడ్ ఉంటుంది. దాన్ని సంపాదించుకుంటే… ఇంట్లోనే సినిమా చూడొచ్చు. ఆ కోడ్‌ని నిజానికి నిర్మాత ద‌గ్గ‌ర నుంచి కొనుక్కోవాలి. దాదాపుగా రూ.10 వేలు ఖ‌ర్చు చేయాలి. ఓ ర‌కంగా నిర్మాత‌కు ఇదో ఆదాయ మార్గం. కానీ అక్క‌డే ఆదాయానికి గండి ప‌డుతోంది. ఓ మంచి సినిమా వ‌స్తే చాలు.. సెల‌బ్రెటీలు, స్టార్లు, రాజ‌కీయ నాయ‌కులు స‌ద‌రు నిర్మాత‌ల‌కు ఫోన్లు చేసి ‘క్యూబ్ ఏర్పాటు చేయండి’ అని అడుగుతున్నారు. ఆ నిర్మాత మొహ‌మాటం కొద్దీ ఫ్రీగానే క్యూబ్ కోడ్ ఇచ్చేస్తున్నాడు. సెల‌బ్రెటీల ఇంట్లో వాళ్లు మాత్ర‌మే ఈ సినిమా చూడ‌డం లేదు. ఆ రోజున‌… చుట్టాలు, ప‌క్కింటోళ్లు. స్నేహితులు.. మొత్తం.. ఆ సినిమాని ‘ఫ్రీ’గా చూసేస్తున్నారు. శుక్ర‌, శ‌ని, ఆది వారాలు క్యూబ్‌ల‌కు ఎక్కువ డిమాండ్ ఉంటోంద‌ట‌. ఆ రోజున ఇంట్లో పార్టీలాంటిది ఒక‌టి సెట‌ప్ చేసుకొని.. క్యూబ్‌లో సినిమా చూసుకుంటున్నారు. ఒక్కో క్యూబ్‌కీ స‌గ‌టున 50 మంది సినిమా చూస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ లెక్క‌న‌.. వాళ్లంతా థియేట‌ర్‌కి వెళ్లర‌న్న‌ట్టేగా. అదంతా నిర్మాత‌కు టికెట్ల రూపంలో రావాల్సిన ఆదాయం. వాటికీ గండిప‌డుతున్న మాటే క‌దా.

హైద‌రాబాద్‌లోని ఫిల్మ్‌న‌గ‌ర్ ఎఫ్ఎన్‌సీసీలో ఓపెన్ ఆడిటోరియం ఉంది. అక్క‌డ వీకెండ్స్ కొత్త సినిమాల్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అది కూడా క్యూబ్ ద్వారానే. ఒక్కో సినిమా దాదాపుగా మూడొంద‌ల మంది చూస్తారు.. ఫ్రీగా. ఇదంతా నిర్మాత‌కు టికెట్ల రూపంలో రావ‌ల్సిన ఆదాయం. క్యూబ్ సిస్ట‌మ్ వ‌ల్ల ఆ ఆదాయం రాకుండా పోతోంది. తెలుగు సినిమా బాగా ఆడుతోందంటే… ప‌క్క రాష్ట్రాల నుంచి కూడా క్యూబ్‌లు ఏర్పాటు చేయ‌మ‌ని ఆర్డ‌ర్లు వ‌స్తుంటాయ‌ట‌. ప్ర‌స్తుతం ‘మ‌హాన‌టి’కి ఇదే త‌ల‌నొప్పి వ‌చ్చింది. ప్ర‌తీ రోజు క‌నీసం 20 మందికైనా క్యూబ్‌లు ఏర్పాటు చేయాల్సివ‌స్తోంద‌ని స‌మాచారం. అలా ఒక్క రోజుకి దాదాపు 2 ల‌క్ష‌ల న‌ష్టం వాటిల్లుతోంది. ”ఇది వ‌ర‌కు ‘నాలుగు టికెట్లు ఇవ్వండి, ప‌ది టికెట్లు ఇవ్వండి’ అని అడిగేవారు.. ఇప్పుడు క్యూబ్‌లు ఇమ్మంటున్నారు. మొహ‌మాటం కొద్దీ ఏర్పాటు చేస్తుంటే.. క్యూబ్లు అడిగేవారు రోజురోజుకీ ఎక్కువైపోతున్నారు” అని ఓ అగ్ర‌శ్రేణి నిర్మాత తెలుగు 360తో త‌న గోడు వెళ్ల‌గ‌క్కుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close