కేసీఆర్ హుజూర్ న‌గ‌ర్ ప్ర‌చార స‌భ‌పై ఉత్కంఠ‌..!

హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌చారానికి వెళ్తున్నారు. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె తీవ్రరూపం దాల్చ‌డం, ఈ అంశంలో ముఖ్య‌మంత్రి స్పందించిన తీరుతెన్నులు, ఉద్యోగుల ప‌ట్ల ఆయ‌న వైఖ‌రిపై చాలా విమ‌ర్శ‌లున్నాయి. ఉప ఎన్నిక ముందు పెట్టుకుని ఆర్టీసీ స‌మ్మెను ఈ స్థాయికి వ‌చ్చే వ‌ర‌కూ కేసీఆర్ ఎందుకు ఉపేక్షించారు అనేదే ఇప్పుడు ప్ర‌శ్న‌? ఆయ‌న ద‌గ్గ‌ర ఏదో మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌నీ, ప్ర‌చార స‌భ‌లో దాన్ని బ‌య‌ట‌పెడ‌తార‌నీ, దీంతో నియోజ‌క వ‌ర్గంలో త‌మ ప్ర‌చార స‌ర‌ళి ఊపందుకుంటుంద‌ని తెరాస వ‌ర్గాలు ఆస‌క్తిక‌రంగా చూస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు కూడా ఈ స‌మ్మె అంశాన్ని హుజూర్ న‌గ‌ర్లో బాగా ప్ర‌చారం చేసుకుంటున్న ప‌రిస్థితి ఉంది.

ముఖ్య‌మంత్రి స‌భ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు కూడా వ్యూహ‌త్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు స‌మాచారం! బుధ‌వారం నాడు ఆర్టీసీ జేయేసీ నేత‌ల‌తో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌భుత్వం, కార్మికులు ఒక అడుగు దిగి రావాల‌నే కోర్టు ఆదేశాల‌పై ప్ర‌ధానంగా చర్చించారు. కార్మికుల‌కు స‌మ్మెకు సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు తెలియ‌జేశారు. నిర‌స‌న‌లు మ‌రింత తీవ్ర‌త‌రం చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతోపాటు, ముఖ్య‌మంత్రి హుజూర్ న‌గ‌ర్ స‌భ‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలిపేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం. కేసీఆర్ ని హుజూర్ న‌గ‌ర్లో నిల‌దీయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది! ఆర్టీసీ స‌మ్మె తీవ్ర‌త‌ర‌మౌతున్నా ముఖ్య‌మంత్రి నోరు మెద‌ప‌క‌పోవ‌డంపై తీవ్రంగా స్పందించాల‌నీ, దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌పై ప్ర‌ధానంగా ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింద‌ని స‌మాచారం.

దీంతో హుజూర్ న‌గ‌ర్లో సీఎం స‌భ ఉత్కంఠ భ‌రితంగా మారింద‌ని చెప్పాలి. అయితే, కేవ‌లం నియోజ‌క వ‌ర్గం అభివృద్ధి గురించి, గ‌డ‌చిన ఆరేళ్లుగా తెరాస స‌ర్కారు పాల‌న విజ‌యాల గురించి మాత్ర‌మే ఇక్క‌డ‌ మాట్లాడి, స‌మ్మె గురించి ప్రస్థావించ‌క‌పోతే అది ప్ర‌తిప‌క్షాల‌కు క‌లిసొచ్చే అంశం అవుతుంది. ఈ విష‌యం కేసీఆర్ అంచ‌నాకి అంద‌నిదైతే కాదు. అలాగ‌ని, త్వ‌ర‌లో చేస్తాం చూస్తామంటూ ఇంకా వాయిదా ధోర‌ణిలో ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేసి, ఎన్నిక‌లు దాటేద్దామ‌నుకున్నా… ఆ త‌ర‌హా వ్యూహం తెరాస‌కు లాభించే వాతావ‌ర‌ణం ఇప్పుడు లేదు. హుజూర్ న‌గ‌ర్లో స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఏదో ఒక‌టి సీఎం చెయ్యాల్సిన ఒత్తిడి క‌నిపిస్తోంది. మ‌రి, కేసీఆర్ వ్యూహం ఎలా ఉందో ఏంటో స‌భ‌లో బ‌య‌ట‌ప‌డుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close