ఊపెక్కిన `అపరిచితు’ని సైబర్ వార్

ఉగ్రవాద భూతం ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పై సైబర్ వార్ ప్రకటించిన `అపరిచితుడు’ అతితక్కువ సమయంలోనే అనుకున్నదానికంటే ఎక్కువ విజయం సాధించాడు. పారిస్ లో ఉగ్రవాదులు దాడులకు దిగిన తర్వాత వారి టిట్వర్ అకౌంట్స్ హ్యాక్ చేసిన Anonymous (అపరిచితుడు) అనే హ్యాకర్స్ గ్రూప్ ఒక వీడియోని రిలీజ్ చేయడం, అందులో ముసుగు ధరించిన వ్యక్తి తెరపై ప్రత్యక్షమై ఉగ్రవాదులపై సైబర్ వార్ ప్రకటించినట్లు పేర్కొనడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు Anonymous హ్యాకర్స్ గ్రూప్ మరో వీడియోని యుట్యూబ్ ద్వారా రిలీజ్ చేసింది. ఐఎస్ ఉగ్రవాదులపై తాము క్రిందటివారం ప్రారంభించిన సైబర్ వార్ ఊపెక్కిందని తాజా వీడియోలో పేర్కొన్నది.

ఒక పక్క ఫ్రెంచ్, రష్యన్, అమెరికా దళాలు మూకుమ్మడిగా ఐఎస్ ఉగ్రవాద స్థావరాలపై ఆకాశదాడుల్లో బాంబుల వర్షం కురిపిస్తుండగా, మరో పక్క Anonymous హ్యాకర్స్ గ్రూప్ (ఇప్పుడు దీన్ని హ్యాక్టివిస్ట్ గ్రూప్ అంటున్నారు) ఉగ్రవాదులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. `OpParis’ పేరిట సైబర్ వార్ డిక్లేర్ చేసినతర్వాత 20వేలకు పైగా ఉగ్రవాదుల ట్విట్టర్ అకౌంట్స్ ను హ్యాక్ చేయగలిగారు. యుట్యూబ్ లో ఉంచిన వీడియోలో హ్యాక్టివిస్ట్ (అపరిచితుడు) మాట్లాడుతూ `ఉగ్రవాదులు సౌషల్ మీడియాద్వారా తమ రహస్య సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు, అయితే అదే సోషల్ మీడియాను మనం ఆయుధంగా మలుచుకుని వారి ఆటలు కట్టించాలి. మనమంతా కలసికట్టుగా పనిచేస్తూ టెర్రరిస్టులు వాడుతున్న అకౌంట్లను నిర్వీర్యం చేద్దాం’- అంటూ పిలుపునిచ్చాడు.

ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఈమధ్యకాలంలో తన రహస్య సమాచార వ్యవస్థను చాలా పటిష్టపరుచుకుంది. సోషల్ మీడియా ద్వారా యూత్ ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అత్యాధునిక ఆయుధాల సమీకరణతోపాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవడంలో ఐఎస్ రాటుతేలింది. ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యమాన్ని అనూహ్యమైనరీతిలో చాలా స్పీడ్ గా ముందుకుతీసుకువెళుతోంది.

ఈ పరిస్థితుల్లో ఐఎస్ ఉగ్రవాదసంస్థ ఆగడాలకు కళ్లెం వెయ్యడం అంతతేలికైన పనికాదని అర్థమవుతూనేఉంది. అందుకే, ఒక పక్క నేరుగా యుద్ధం జరుపుతూనే మరో పక్క సైబర్ వార్ కూడా అనివార్యమైంది. ఈ అవసరాన్ని పసిగట్టే, Anonymous హ్యాకర్స్ గ్రూప్ పుట్టుకొచ్చింది. క్రిందటి వారం సైబర్ వార్ ప్రకటించిన ఈ గ్రూప్ ఒకటి రెండు రోజుల్లోనే ఉగ్రవాదులు, లేదా వారి మద్దతుదారులు ఉపయోగించే ఆరువేల ట్విట్టర్ అకౌంట్స్ ను హ్యాక్ చేసింది. ఇప్పుడు ఆ సంఖ్యను 20వేలు దాటించింది. ఈలోగా సామాజిక మాద్యమాలను నడుపుతున్న సంస్థలు (ఫేస్ బుక్ వంటివి) తమ పరిధిలో ఉన్న అనుమానిత అకౌంట్లను బ్లాక్ చేస్తున్నాయి. మొత్తానికి ఉగ్రవాదులను ఉక్కిరిబిక్కిరి చేయడమే ఈ సైబర్ వార్ ప్రధానోద్దేశం. ఏ దేశమూ పిలిపునివ్వకపోయినా స్వచ్ఛందంగా ఈ సైబర్ వార్ మొదలుకావడం గమనార్హం.

సైబర్ వార్ ని Anonymous క్రిందటివారం ప్రకటించిన తర్వాత అటు ఉగ్రవాద సంస్థ ఎలెర్ట్ అయింది. తమ రహస్య సంకేతాలను చేరవేసేవిషయంలోనూ, తమ సైబర్ అకౌంట్స్ హ్యాక్ కాకుండా కాపాడుకునే విషయంలోనూ కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఐఎస్ ఉగ్రవాద సంస్థ తన మద్దతుదారులకు ఓ ఐదు యాంటీ హ్యాకింగ్ టిప్స్ ను పంపించినట్లు తెలుస్తోంది. ఈ టిప్స్ ద్వారా హ్యాకింగ్ ఎటాక్స్ నుంచి బయటపడవచ్చని భావిస్తోంది.

మొత్తానికి Anonymous హ్యాకర్స్ గ్రూప్ ఒక పక్క చెలరేగుతుంటే, మరో పక్క ఐఎస్ఐఎస్ కూడా అంతే స్పీడ్ తో సైబర్ వార్ ని ఎదుర్కోవడానికి రక్షణ వలయాన్ని ఏర్పాటుచేసుకుంటున్నది. సైలెంట్ గా సాగే ఈ సైబర్ వార్ మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close