‘ఢీ’కి సంబంధం లేదు!

సీక్వెల్, ప్రీక్వెల్ సంస్కృతేం కొత్త కాదు. దాదాపుగా హిట్ట‌యిన ప్ర‌తీ సినిమాకీ సీక్వెల్ చేయాల‌న్న ఆలోచ‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఉంటుంది. ప్ర‌స్తుతం మ‌రో సీక్వెల్ ప‌ట్టాలెక్కుతోంది. అదే… డీ అండ్ డీ. మంచు విష్ణు – శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `ఢీ`కి సీక్వెల్ ఇది. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. ఢీ సీక్వెల్ అన‌గానే.. కొన్ని ప్ర‌శ్న‌లు ఉద్భ‌వించాయి. శ్రీ‌హ‌రి పాత్ర ఎవ‌రు పోషిస్తారు?  జ‌య ప్ర‌కాష్ రెడ్డిగా ఎవ‌రు క‌నిపిస్తారు?  వాళ్ల‌కు ప్ర‌త్యామ్నాయాలు ఉన్నాయా?  అని ఆరా తీశారు.

అయితే.. ఢీ క‌థ‌కూ.. దీనికీ సంబంధం లేద‌ట‌. ఇది వేరే జోన‌ర్‌. ఢీ క‌థ‌కి ఇది కొన‌సాగింపు కాద‌ని.. మంచు విష్ణు తేల్చేశాడు. సో.. శ్రీ‌హ‌రి, జ‌య ప్ర‌కాష్ రెడ్డి పాత్ర‌లు ఇందులో వాడాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌మాట‌. కాక‌పోతే.. ఢీ మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌. అందులో బ్ర‌హ్మానందం పాత్ర చాలా కీల‌కం. `న‌న్ను ఇన్‌వాల్వ్ చేయ‌కండి రావు గారూ` అంటూ బ్ర‌హ్మానందం పంచిన కామెడీ ట్రేడ్ మార్క్ అయిపోయింది. అలాంటి పాత్ర‌లు, అంత‌టి వినోదం లేక‌పోతే.. ఈ సీక్వెల్ వ‌ర్క‌వుట్ అవ్వ‌డం క‌ష్టం. మ‌రి శ్రీ‌నువైట్ల ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close