ప‌వ‌న్ రాజ‌కీయాల‌పై.. దాస‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో రాణిస్తాడా? జ‌న‌సేన‌ను జ‌నం మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌గ‌ల‌డా? అన్న‌య్య స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలానే జ‌న‌సేన మార‌బోతోందా?? ప‌వ‌న్ అభిమానుల్లో ఎక్క‌డో ఏదో చోట ఇలాంటి అనుమానాలు ఉండ‌డం స‌హ‌జం. ప‌వ‌న్ పార్టీపై ఇప్ప‌టికే చాలామంది చాలా ర‌కాలుగా మాట్లాడారు. కానీ… దాస‌రి నారాయ‌ణ‌రావు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ నోరు మెద‌ప‌లేదు. తొలిసారి ప‌వ‌న్ పార్టీపై దాస‌రి నోరు విప్పారు. ”ప‌వ‌న్ రాజ‌కీయాల్లోనూ రాణిస్తాడ‌న్న న‌మ్మ‌కం నాకుంది” అంటూ ప‌వ‌న్‌ని వెన‌కేసుకొచ్చారు. ”ఇచ్చిన మాట‌పై నిల‌బ‌డే మ‌న‌స్త‌త్వం ప‌వ‌న్‌కి ఉంది. ఆ నిజాయ‌తీ చాలామందికి న‌చ్చింది. అందుకే అత‌ని వెంట అంత‌మంది ఉన్నారు” అంటూ తొలిసారి ప‌వ‌న్ పార్టీపై స్పందించారు.

ఈరోజు సాయింత్రం దాస‌రి త‌న ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ఈసంద‌ర్భంగా ప‌వ‌న్ పార్టీ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. రాజ‌కీయాల కోసం ప‌వ‌న్ సినిమాల‌కు దూరం అవుదామ‌నుకొంటున్నాడు. దీనిపై మీ వ్యాఖ్యలేంటి? అని ప్ర‌శ్నిస్తే.. ”రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం మంచిది కాదు. అందుకే ప‌వ‌న్ ఆ నిర్ణ‌యం తీసుకొని ఉంటాడ‌”ని చెప్పుకొచ్చారు దాస‌రి. త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌తో దాస‌రి సినిమా మొద‌ల‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అందుకే ప‌వ‌న్ పై దాస‌రి పాజిటివ్ వ్యాఖ్య‌లు చేసుండొచ్చ‌నుకొంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. చిరంజీవి పార్టీ పెట్టిన‌ప్పుడు గ‌ట్టిగా వ్య‌తిరేక‌గ‌ళం వినిపించిన దాస‌రి.. త‌మ్ముడు ప‌వ‌న్‌ని స‌పోర్ట్ ఇవ్వ‌డం మెగా ఫ్యాన్స్‌ని సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close