దాస‌రి గారూ.. మీరు మ‌రీనండీ!!

దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌గ్గ‌ర ఓ ప్ర‌త్యేకత ఉంది. తిట్టినా, పొగిడినా… అది పీక్స్‌లో ఉంటుంది. ఎవ‌రి ఫంక్ష‌న్‌కి వెళ్తే… వాళ్ల‌ని ఆకాశంలోకి ఎత్తేస్తుంటారు. బుధ‌వారం… శ్రీ‌కాంత్ న‌టించిన మెంట‌ల్ పోలీస్ సినిమా ట్రైల‌ర్ లాంచ్ కి అతిథిగా వెళ్లారు దాస‌రి. అక్క‌డ శ్రీ‌కాంత్‌ని పొడ‌డ్త‌ల‌తో ముంచేశారు. ‘శ్రీ‌కాంత్ నా బిడ్డ‌లాంటోడు’ అంటూ రొటీన్‌గానే త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించిన దాస‌రి శ్రీ‌కాంత్‌ని వంద కోట్ల హీరో అన‌డం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. శ్రీ‌కాంత్ న‌టించిన టెర్ర‌ర్ సినిమాని దాస‌రి ఇటీవ‌లే చూశార‌ట‌. అది వంద కోట్ల సినిమా అంటూ అభివ‌ర్ణించారు. హిందీలో గ‌నుక ఈ సినిమా తీసుంటే.. క‌చ్చితంగా వంద కోట్లు వ‌చ్చేవ‌ని, ఇప్ప‌టికైనా మించిపోయింది లేద‌ని, హిందీ వాళ్లు రీమేక్ రైట్స్ తీసుకోండ‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు.

దాస‌రి పొగ‌డ్త తో శ్రీ‌కాంత్ ఉబ్బిత‌బ్బిబ్బి అయిపోయినా.. చుట్టుప‌క్క‌ల వాళ్లు మాత్రం.. ‘దాస‌రిగారు మీరు మ‌రీనండీ’ అన్నట్టే చూశారు. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి కూడా దాస‌రికి తోడుగా గొంతు క‌లిపారు. శ్రీ‌కాంత్ అంటేనే పెద్ద హీరో అని, ఆయ‌న న‌టించిన సినిమా చిన్న సినిమా ఎందుకు అవుతుంద‌ని ఆయ‌న నిల‌దీశారు. బాగానే ఉంది ఈ పొగ‌డ్త‌ల యవ్వారం. పాపం.. వంద సినిమాల హీరో శ్రీ‌కాంత్ ఒక్క హిట్టూ లేక తెగ ఇదైపోతున్నాడు. ఈ మెంట‌ల్ పోలీస్ అయినా కాస్త రిలాక్సేష‌న్ ఇస్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close