‘డియర్ కామ్రేడ్’.. మెలోడితో శుభారంభం

నవతరం దర్శకులని ఓ విషయం లో మెచ్చుకుని తీరాలి. సంగీతం, సాహిత్యం విషయం లో వాళ్ళు చూపిస్తున్న శ్రర్ధ చూస్తుంటే ముచ్చటేస్తోంది. తెలుగు పాటల్లో, తెలుగు పదాలు మృగ్యమైపోతున్నాయి అని బాధ పడిన వాళ్ళు కూడా ఇప్పటి పాటల్ని చూసి మురిసిపోతున్నారు. ఓ మంచి పాట వస్తే.. దాన్ని గుండెల్లో దాచుకోవడానికి శ్రోత లెప్పుడు సిద్ధంగానే వుంటారు. అందుకే ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే వున్నాయి.

తాజా గా `డియర్ కామ్రేడ్` లో ఓ పాట వచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. ఈ రోజు ”నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే, నీ కాలి అందెల్లోని సంగీతమే… నీవైపు లాగేసింది నన్నే” అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన తొలిపాట ఇదే. తొలిసారి వినగానే నచ్చేసే మెలోడీ ఇది. సుతిమెత్తని ట్యూన్, దానికి సరిపడే తీయని తెలుగు పదాలు, శ్రావ్యమైన గొంతు.. ఇవన్నీ కట్టి పడేస్తాయి. రెహమాన్ రాసిన ఈ పాటని గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. ప్రభాకరన్ సంగీతం అందించారు. టీజర్ చూడగానే.. దర్శకుడితో టేస్ట్ అర్థమయ్యింది. తనకి సాహిత్యం తో వున్నా అభిరుచి ఈ పాట బయటపెట్టింది. డియర్ కామ్రేడ్ ఆడియో కి ఇది మంచి ఆరంభం అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close