మహేష్‌, మురుగదాస్‌ సినిమాలో  దీపికాపదుకొనే?

మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో పివిపి నిర్మిస్తున్న ‘బ్రహ్మూెత్సవం’ షూటింగ్‌ జరుగుతుండగానే మహేష్‌ నెక్స్‌ట్‌ సినిమా గురించి మీడియాలో హాట్‌ డిస్కషన్స్‌ స్టార్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి నిర్మాతలు ఎవరు అనే విషయం ఇప్పటికీ కన్‌ఫర్మ్‌ అవ్వనప్పటికీ హీరోయిన్‌ విషయంలో మాత్రం రకరకాల ఊహాగానాలు చేసేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలని మహేష్‌, మురుగదాస్‌ డిస్కస్‌ చేస్తున్న విషయం మాత్రం వాస్తవం.

తనకు దీపికా పదుకొనే అంటే ఎంతో ఇష్టమని ఆమధ్య మహేష్‌ చెప్పిన విషయం తెలిసిందే. మహేష్‌లాంటి సూపర్‌స్టార్‌ తన గురించి అలా చెప్పడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని దీపికా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన విషయం కూడా మనకు తెలుసు. దీన్నిబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వుంటుందన్న వార్తలు ఆమధ్య వచ్చాయి. అది ఇప్పుడు మహేష్‌, మురుగదాస్‌ సినిమాకి నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరోయిన్‌ విషయంలో మహేష్‌ పట్టుపడుతున్నాడని తెలుగు360లో చెప్పినట్టుగానే తన సినిమాలో దీపికా పదుకొనే అయితేనే బాగుంటుందని మహేష్‌ సూచించాడట. దీంతో మురుగదాస్‌.. దీపికాను హీరోయిన్‌గా తీసుకునే విషయంలో చర్చలు జరుపుతున్నాడట. తెలుగు, తమిళ భాషల్లో హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దీపికా ఎంతవరకు డేట్స్‌ అడ్జస్ట్‌ చెయ్యగలదు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అంతేకాకుండా ఒక సినిమాకి 6 కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ తీసుకునే దీపికా కోసం అంత బడ్జెట్‌ పెట్టగలమా అనే ఆలోచన కూడా చేస్తున్నారట.

బాలీవుడ్‌లో ఓం శాంతి ఓం చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై చాలా తక్కువ టైమ్‌లోనే టాప్‌ హీరోయిన్‌గా ఎదిగిన దీపికా లవ్‌ ఆజ్‌ కల్‌, చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌, రామ్‌లీలా, బాజీరావ్‌ మస్తానీ వంటి సినిమాల్లో తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేసింది. పికు అనే చిత్రంలోని ఆమె నటనకుగాను బెస్ట్‌ యాక్ట్రెస్‌గా ఫిలిమ్‌ఫేర్‌ అవార్డును కూడా ఇటీవల అందుకున్న దీపికా.. మహేష్‌ కోసం తెలుగు సినిమాలో నటిస్తే అతని అభిమానులకు అంతకంటే ఆనందం ఏముంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close