దీపికా… ఈ వెలుగులు శాశ్వతం కావు

సినిమా తారల ప్రణయకలాపాలు వ్యక్తిగత వివాదాలకు ఎక్కడలేని ప్రచారం లభిస్తుంది గాని వారిలోని మానవీయ కోణాలు మనవాళ్లకు అంతగా పట్టవు.అగ్రకథానాయిక దీపికా పడుకునే విషయంలో అదే జరిగింది. పీకూ చిత్రానికి గాను ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న సందర్భంలో ఆమె తన తండ్రి బాడ్మింటన్‌ తార ప్రకాశ్‌ పడుకునే ఎప్పుడో రాసిన లేఖను చదివి వినిపించి అందరితో కంటతడి పెట్టించారు.

దీపిక, ఆమె సోదరి అనీషలను ఉద్దేశించి రాసిన ఆ లేఖలో ప్రకాశ్‌ విజయం సాధించాలనుకునే ప్రతివారికీ వర్తించే జీవిత సత్యాలు చెప్పారు. దృఢ నిశ్చయం, ఓటమిని తట్టుకునే తత్వం, ప్రచారం ప్రతిపలం గాక ఆసక్తితో ఏదైనా పనిచేయడం ముఖ్యమని తన అనుభవాలతో వివరించారు. ఎలాటి శిక్షణా సదుపాయాలు లేని రోజుల్లో తాను బాడ్మింటన్‌ నేర్చుకుని ఆ రోజుల్లో భారీ మొత్తాలు అందుకోగలిగినా ఆడటమే తనకు అమిత సంతోషం ఇచ్చేదని ఆయన రాశారు. దీపిక చిన్న తనంలో మోడలింగ్‌ వృత్తిని చేపట్టాలనుకున్నప్పుడు ఆ రంగంలో సమస్యలు తెలిసి కూడా నిరుత్సాహ పర్చకూడదని తాము ఒప్పుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. పిల్లలు తమ ఆశలు నెరవేర్చుకోవడానికి తాముగా కృషి చేయాలే గాని తలిదండ్రులు అన్నీ అమర్చిపెట్టాలని చూడకూడదు.. ఆ ప్రయత్నంలో విఫలమైనా చేయాల్సింది చేశామన్న తృప్తి వుంటుంది.. నీవు ఇంటికి వచ్చినపుడు నీ పనులన్నీ నీవే చేసుకుంటావు. అవసరమైతే నేల మీద కూడా పడుకుంటావు. ఇదంతా ఎందుకంటే ఇంట్లో నీవు తారవు కావు..తారగా నీ వెంట వచ్చే ధగధగ వెలుగులు రేపు వుండకపోవచ్చు. కాని మానవ సంబంధాలు కుటుంబం విలువలు మాత్రం మిగులుతాయి. అవే మనతో వుంటాయి అని ఆయన రాసిన లేఖను ఆమె ఉద్వేగంతో పూర్తి చేయగానే కరతాళధ్వనులు మార్మోగాయి. చాలామంది కళ్లుతుడుచుకున్నారు. వేదిక మీద వున్న రేఖ అభిమానంగా ఆలింగనం చేసుకున్నారు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close