అల్లు అర్జున్, అట్లీ, సన్ పిక్చర్స్ సినిమాకి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీమ్ ఇందులో హీరోయిన్గా ఎవరు కనిపించనున్నారో ప్రకటించింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఇందులో బన్నీకి జోడీగా కనిపించనున్నారని వెల్లడించింది. ‘కల్కి’ తర్వాత దీపిక చేస్తున్న తెలుగు సినిమా ఇదే.
నిజానికి ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాకోసం దీపికను సంప్రదించారు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో ఇష్యూ రావడంతో ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నారు. ఈ విషయంలో సందీప్ వంగా – దీపిక మధ్య కొల్డ్ వార్ నడిచింది. తన కథను లీక్ చేసిందని ఆరోపణ చేస్తూ సందీప్ ఓ పోస్ట్ పెట్టడం, దానిపై పెద్ద చర్చ జరగడం, వెంటనే తృప్తి డిమిరిని ప్రాజెక్ట్‌లోకి తీసుకోవడం అన్ని చకచక జరిగిపోయాయి,
ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి సైన్ చేసింది దీపిక. ‘స్పిరిట్’ సినిమాకి రూ. 20 కోట్లు డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. మరి అల్లు అర్జున్ సినిమా కోసం ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీపిక రెమ్యూనరేషన్ విషయంలో చాలా ఖచ్చితంగా వుంటుంది. తాను కోరినంత ఇవ్వడంతో సైన్ చేయడంతో పాటు, ప్రమోషనల్ వీడియోకూ టైమ్ ఇచ్చిందని సమాచారం.
సన్ పిక్చర్స్ మామూలు సంస్థ కాదు. రెమ్యూనరేషన్‌తో పాటు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చి నటీనటులను సర్ప్రైజ్ చేయడం ఆ సంస్థకు అలవాటు. కాబట్టి, దీపిక కోరినంత రెమ్యూనరేషన్ అందినట్టే భావించాలి.