పూరి కూడా ‘స్లో’ అయిపోయాడేంటి..?

రిలీజ్ డేట్ చెప్పి మ‌రీ సినిమాలు విడుద‌ల చేయ‌డంలో పూరి జ‌గ‌న్నాథ్ దిట్ట‌. హీరో దొర‌కాలే గానీ.. మూడు నెల‌ల‌కు ఓ సినిమా విడుద‌ల చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. స్టార్ హీరోతో కేవ‌లం 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడంటే… పూరి ట్రాక్ రికార్డు అర్థం చేసుకోవొచ్చు. ప్ర‌స్తుతం త‌ను రామ్‌ని ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ గా చూపిస్తున్నాడు. క్లాప్ కొట్టిన రోజే ‘ఈ సినిమాని మేలో విడుద‌ల చేస్తాం’ అని ప్ర‌క‌టించాడు కూడా. పూరి స్పీడు గురించి తెలుసు కాబ‌ట్టి.. మేలో ఈ సినిమా వ‌చ్చేస్తుంద‌నుకున్నారంతా.

కానీ… పూరి కూడా స్లో అయిపోయిన‌ట్టు అనిపిస్తోంది. ఈ సినిమా ఇంకా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది. క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కూ టీజ‌ర్ కూడా రాలేదు. ఇప్పుడున్న మూడ్‌ని చూస్తే మేలో ఈ సినిమా రాదు. జూన్‌లో వ‌స్తుందేమో చూడాలి. పూరి ఓ డేట్ చెప్పి, సినిమాని విడుద‌ల చేయ‌క‌పోవ‌డం, క‌నీసం ఆ దిశ‌గా ఆలోచించ‌క‌పోవ‌డం బ‌హుశా ఇదే తొలిసారేమో. కాక‌పోతే.. చిత్ర‌బృందం మ‌రోలా ఆలోచిస్తోంది. మేలో పెద్ద సినిమాల హ‌డావుడి క‌నిపిస్తోంది. ముఖ్యంగా మ‌హ‌ర్షి విడుద‌ల అవుతోంది. ఆ సినిమా హిట్ట‌యితే రెండు మూడు వారాల వ‌ర‌కూ కొత్త సినిమాని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు భ‌య‌ప‌డుతుంటారు. అందుకే… మ‌హ‌ర్షి హ‌డావుడి అయిపోయాక సినిమాని తీసుకొద్దామ‌ని పూరి కూడా నిదానంగానే షూటింగ్ చేసుకుంటున్నాడు. పైగా పూరికి ఈ సినిమా చాలా ముఖ్యం. త‌నే నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు కాబ‌ట్టి… డ‌బుల్ కేర్ తీసుకోక‌త‌ప్ప‌డం లేదు. హ‌డావుడిగా సినిమాని విడుద‌ల చేయ‌డం కంటే మంచి టైమ్ చూసుకుని వ‌ద‌ల‌డం బెట‌ర్ అనుకుంటున్నాడు. మొత్తానికి పూరి కూడా ‘ఇస్మార్ట్‌’గా ఆలోచించ‌డం మొద‌లెట్టాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close