ఐపీఎల్ కిక్ : ఢిల్లీ వర్సెస్ పంజాబ్..! అసలు విజేత ఎవరు..?

ఆదివారం క్రికెట్ అభిమానులకు ఢిల్లీ, పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ పసందైన విందు అందించింది. రోమాలు నిక్కబొడుచుకునేంత ధ్రిల్లర్‌ను చూపించింది. చివరికి విజేతగా ఢిల్లీ నిలిచి ఉండవచ్చు కానీ.. ఏ క్షణమైనా మళ్లీ ఫలితం తారుమారైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే మ్యాచ్ ముగిసిపోయినా… ఇంకా ముగియలేదని అనుకోవాలి. ఇలా ఎలా జరుగుతుందంటే.. ఆ మ్యాచ్‌లో అంత ట్విస్ట్ ఉంది మరి.

ఢిల్లీ, పంజాబ్ లీగ్ మ్యాచ్‌లో ఎవరు ఫేవరేటో అంచనా వేయలేని పరిస్థితి. మ్యాచ్ ప్రారంభం కాక ముందే కాదు.. ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి. ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 19వ ఓవర్ వరకూ… పంజాబ్‌కు కేక్ వాక్ అనుకున్నారు. అంత స్లోగా స్కోర్ వచ్చింది. కానీ చివరి ఓవర్లో స్టాయినిస్ 30 పరుగులు రాబట్టి… పంజాబ్‌కు కాస్త కష్టమే అనిపించేలా చేయగలిగాడు. అయితే.. పంజాబ్ బ్యాటింగ్ కూడా అంతే. చివరి వరకూ… ఇక పంజాబ్ కష్టమే అనుకున్నారు. కానీ లాస్ట్‌లో మయాంక్ అగర్వార్ విజృంభించడంతో ఇక విజయం ఖాయమే అనుకున్నారు. చివరి రెండు ఓవర్లలో పాతిక పరుగులు కావాలంటే… తొమ్మిది బంతుల్లోనే 24 పరుగులు కొట్టేశారు. కానీ చివరి మూడు బంతులలో ఆ ఒక్కటి కొట్టలేకపోయారు. ఫలితంగా టై. సూపర్ ఓవర్. సూపర్ ఓవర్లో పంజాబ్ మూడు బంతులే ఆడగలిగింది. రెండు వికెట్లు కోల్పోవడంతో అక్కడే ఆపేయాల్సి వచ్చింది. ఢిల్లీ సునాయసంగా గెలిచింది. కానీ ఇప్పటికీ పంజాబ్‌కి గెలుపైపై ఆశలు ఉన్నాయి

ఎందుకంటే.. మ్యాచ్ టై అయిందంటే.. స్కోర్ సమం అయిందని అర్థం. కానీ నిజానికి స్కోరు సమం కాలేదు. పంజాబ్ ఓ రన్ ఎక్కువే కొట్టింది. 19వ ఓవర్‌ను బౌలర్ రబాడ వేశాడు. ఆ ఓవర్‌లో మయంక్ ఓ బాల్‌కి రెండు పరుగులు తీశాడు. నాన్ స్టైకింగ్‌లో ఉన్న క్రిస్‌ జోర్డాన్‌ బ్యాటును క్రీజులో ఉంచలేదని లెగ్‌ అంపైర్‌ నితిన్‌ మేనన్‌ ఒక పరుగు కోత విధించాడు. కానీ జోర్డాన్.. బ్యాట్‌ను క్రీజుకు అంటించినట్లుగా టీవీ రీప్లేలో స్పష్టమయింది. ఆ పరుగు ఉంటే.. పంజాబ్ సూపర్ ఓవర్ దాకా పోయి ఓడిపోయేది కాదు.. ముందే గెలిచి ఉండేది. ఈ ఓటమిని పంజాబ్ అంగీకరించడానికి సిద్ధం లేదు. జట్టు యాజమాన్యం ఐపీఎల్‌ పాలక మండలికి ఫిర్యాదు చేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close