ఆనందం, మనకెందుకు దూరం?

ప్రపంచం మొత్తం మీద హ్యపీయెస్ట్ దేశంగా డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది. భూతలస్వర్గంగా ఐరోపా ప్రజలు పిలుచుకునే స్విట్జర్లాండ్ రెండో ర్యాంక్ పొందింది. ఐస్ లాండ్, నార్వే, ఫిన్లాండ్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా 13వ స్థానం పొందింది. ఇంగ్లండ్ 23వ ర్యాంకుకు పరిమితం కావడం విశేషం.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఆనందం తాండవించడ మామూలే. మనది అభివృద్ధి చెందుతున్న దేశమైనా ఆధ్యాత్మిక సంపద అధికంగా ఉన్న దేశం. కర్మ సిద్ధాతం, పరస్పర సహకారం, సంఘ జీవనం, ఉన్నంతలో సంతృప్తి పడటం వంటి అనేక లక్షణాలున్నా మన దేశంలో ఆనందం నామమాత్రమే అని తాజా జాబితా వెల్లడించింది. 157 దేశాల్లో భారత్ అట్టడుగు దిశగా పరుగులు తీస్తూ 118వ స్థానం వద్ద ఆగింది. జనాభాలో రెండో అతిపెద్ద దేశం. వృద్ధిరేటులో చైనాను అధిగమించిన దేశం. గతంతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు పెరిగిన దేశం. అయినా మన దేశంలో ఆనందం తాండవించకపోవడానికి కారణాలు ఏమిటనేది ప్రశ్న.

అభివృద్ధిలో మనకంటే వెనుకబడిన దేశం, ఉగ్రవాద దాడులతో సతమతం అవుతున్న దేశం, అన్ని విధాలుగా మనకంటే దిగదుడుపుగా మనం భావించే పాకిస్తాన్ మెరుగ్గా ఉంది. ఆనందంగా జీవించడంలో పాకిస్తానీలు మనకంటే చాలా ముందున్నారు. హ్యాపీనెస్ జాబితాలో పాక్ 92వ ర్యాంకు పొందింది. మరో పొరుగు దేశం శ్రీలంక 117, బంగ్లాదేశ్ 110వ ర్యాంక్ పొందాయి. చాలా విషయాల్లో మనమీదే ఆధార పడే నేపాల్ కూడా మనకంటే మెరుగ్గా, 107వ స్థానంలో ఉంది.

జీడీపీ తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, ప్రజారోగ్యం ఆయుష్లు (లైఫ్ ఎక్స్ పెక్టెన్సీ), నచ్చిన పని చేసే స్వేచ్ఛ, అవినీతి అనే అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయించారు. అంటే, ప్రభుత్వ విధానాలు, ప్రజల వైఖరి మేలు కలయిక ద్వారా ఈ ర్యాంకింగ్ నిర్ణయం జరిగింది. సామాజిక మద్దతు అనే విషయంలో భారత్ ఏ స్థానంలో ఉందనే దానిపై విడిగా గణాంకాలు అందుబాటులో లేవు. అయితే, ఇటీవలి కాలంలో ఈ విషయంలోనూ మనకు మార్కులు తగ్గి ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు, అవినీతి అంశం కూడా మైనస్ పాయింగా అయి ఉంటుంది. మనకంటే ఎక్కువ అవినీతి తాండవిస్తుందని భావించే పాక్ మనకంటే మెరుగైన స్థితిలో ఉండటం ఆశ్చర్యం. కర్మ సిద్ధాంతం, ఉన్నంతలో తృప్తి పడటంతో భారతీయుల లక్షణాలుగా చెప్తారు. ఈ విషయాల్లోనూ మన వైఖరి మారిందా? హ్యాపినెస్ దేశాల జాబితా చూస్తే అవుననే అనిపిస్తుంది.

గత కొంత కాలంగా మన దేశంలో ప్రజారోగ్య రంగం మెరుగుపడింది. ప్రజల ఆయు:ప్రమాణం కూడా పెరిగింది. అయితే ప్రయివేటు వైద్యం ఖరీదైపోవడం, ప్రభుత్వ ఆస్పత్రులు నామమాత్రంగా మారడం తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అనే బాధ్యతను ప్రభుత్వాలు దాదాపుగా మర్చిపోతున్నాయి. ఆరోగ్య కార్డులు ఇచ్చేసి ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లమని చెప్పడం ద్వారా తమ బాధ్యతను విస్మరిస్తున్నాయి. ఐరోపా దేశాల్లో జ్వరం నుంచి బైపాస్ సర్జరీ వరకూ అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పొందవచ్చు. ఇంగ్లండ్ తో పాటు అనేక దేశాల్లో ఈ విధానమే అమల్లో ఉంది. కాబట్టే, ఆరోగ్యం విషయంలో ఆ దేశాలు అత్యున్నత ర్యాంక్ పొంది ఉంటాయి. ఓవరాల్ ర్యాంకింగులోనూ ముందు వరసలో నిలవడానికి అదే కారణం అయి ఉంటుంది. తాజా జాబితా మన దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి. ముఖ్యంగా ఆరోగ్యం, అవినీతి విషయాల్లో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రజలుమరింత ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close