తెలకపల్లి రవి : కడియం తొలగింపు వూహాగానమే!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని తప్పించవచ్చంటూ కథనాలు రావడం ఆయన జరక్కపోవచ్చని మెత్తగా చెప్పడం ఆసక్తికరం. ఎర్రబెల్లి దయాకరరావుకు కడియంకు కొండా మురళికి మధ్య తీవ్ర వైరుధ్యాలున్నాయనేది బహిరంగ రహస్యం. మరీ ముఖ్యంగా అధికార కార్యక్రమాల్లో ఎర్రబెల్లి ప్రతిసారీ శ్రీహరితో ఘర్షణ పడటం పరిపాటి. ఇదికొన్నిసార్లు ఎబ్బెట్టుగానూ వుండేది. ఆయన టిఆర్‌ఎస్‌లోకి వెళ్లాలనుకుంటే ముందుగా నేనుచేరి ఉన్నత స్థానం సంపాదించడమే వల్లనే ఈ అక్కసు అని శ్రీహరి అంటుంటారు. నిజానికి మొదటి ఉపముఖ్యమంత్రి డా.రాజయ్య స్థానంలో శ్రీహరిని తీసుకోవడం నాటకీయంగా జరిగింది. సీనియర్‌గా ఆయనకు సముచిత గౌరవం లభిస్తున్నది కూడా. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాటతప్పారనేది కెసిఆర్‌పై ఒక విమర్శగా వుంటూనే వుంది. ఉప ముఖ్యమంత్రి దళితులకు ఇచ్చి గౌరవించి ఆ విమర్శను తటస్థపర్చడం కెసిఆర్‌ రాజకీయ అవసరం. ఇంకా అనేక మందిపై ఆరోపణలున్నా రాజయ్యనే తేలిగ్గా తీసేశారన్న విమర్శలు బలహీనంగానైనా రాకపోలేదు. శ్రీహరిని కూడా తొలగించడమంటే ఆ విమర్శలను నిర్ధారించడమే అవుతుందని కెసిఆర్‌ వంటి రాజకీయ వేత్తకు బాగా తెలుసు.రాజయ్య విషయంలో చూపిన ఆరోపణల వంటివి శ్రీహరిపై వుండకపోవచ్చు కూడా. ఆయనను తీసుకెళ్లి శాసనమండలి చైర్మన్‌ను చేయడం హాస్యాస్పదంగా వుంటుందని అందరికీ తెలుసు.కనుక శాఖల మార్పులు జరగొచ్చు గాని పూర్తిగా తొలగించి తలనొప్పి కొని తెచ్చుకోరనే అంటున్నారు. పైగా ఎర్రబెల్లికి ఇష్టమైన వారే ఈ విధమైన కథనాలు వదులుతున్నారని కడియం శిబిరం భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close