‘కాలా’ కాన్సెప్ట్ ఇదే

ర‌జ‌నీకాంత్ ‘కాలా’ కాన్సెప్ట్ ఏంటి? క‌థేంటి? – ర‌జ‌నీ అభిమానులు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్న ప్ర‌శ్న‌ల‌వి. అదో.. మినీ డాన్ నేప‌థ్యంలో సాగే క‌థ అని ట్రైల‌ర్లు, ర‌జ‌నీ గెట‌ప్పులూ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. అయితే.. ఈసినిమాలో చ‌ర్చించ‌బోయే అస‌లు విష‌యం ఏమిట‌న్న‌ది ధ‌నుష్ చెప్పాడు. ‘కాలా’ సినిమాకి ధ‌నుష్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా క‌థ గురించి ధ‌నుష్ క్లూ ఇచ్చాడు. ‘భూ స‌మ‌స్య‌’పై ఈ సినిమా సాగ‌బోతోంద‌ని హింట్ ఇచ్చేశాడు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో ఉంది. అక్క‌డ సాగే క‌థ ఇది. దేశంలోని దాదాపు 60 శాతం మందికి సొంత భూమి లేదు. దానికి కార‌ణం ఎవ‌రు? అస‌లు మురికివాడ‌లు ఎందుకు త‌యార‌వుతున్నాయి? భూముల్ని స్వాహా చేస్తున్న పెద్ద స్వాములు ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కాలాలో క‌నిపిస్తుంద‌ట‌. ”భూస‌మ‌స్య అనే కాదు.. ఇందులో చాలా అంశాలు చ‌ర్చించాం. నిజ జీవితంలో మ‌న‌కు ఎదురయ్యే అనేక స‌మ‌స్య‌ల‌పై కాలా పోరాడ‌తాడు. ర‌జ‌నీకాంత్‌లోని అస‌లు సిస‌లైన హీరోయిజం ఈ సినిమాలో చూడ‌బోతున్నారు” అన్నాడు పా. రంజిత్‌. త‌మిళ‌నాడులో రాజ‌కీయ సెగ ఎక్కువ‌గా ఉంది. దానికి తోడు ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టేశాడు. ఈ నేప‌థ్యంలో పొలిటిక‌ల్ సెటైర్ల‌కూ ‘కాలా’లో ఆస్కారం క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close