ధర్నాచౌక్ అడ్ర‌స్ మారుస్తున్న ధ‌ర్మ ప్ర‌భువులు..!

తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మాన్ని ఒక్క‌సారి గుర్తు చేసుకుంటే… రోజుకో ధ‌ర్నా, వారానికో రాస్తారోకో, నెల‌కో దీక్ష అన్న‌ట్టుగా తెరాస ఉద్య‌మించింది. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను అద్దం ప‌డుతూ సుదీర్ఘ‌కాలం నిర‌స‌న‌లు చేప‌ట్టింది. అయితే, క్ర‌మంలో నిర‌స‌న‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వాలు చేస్తుంటే… ఒంటికాలిపై కేసీఆర్ లేచేవారు! భావ‌ప్ర‌క‌ట‌నా హ‌క్కును కాల‌రాస్తున్నార‌నీ, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారంటూ ఓ రేంజిలో గ‌ర్జించేవారు. కానీ, ఇవాళ్ల తెరాస సర్కారు చేస్తున్న‌దేంటీ..? అధికార పీఠంపైకి ఎక్కిన త‌రువాత వారు చేస్తున్న‌దేంటీ..? నిర‌స‌న‌లు, ఉద్య‌మాల‌ను అడ్డుకోవ‌డంపై ఇప్పుడు కేసీఆర్ స‌ర్కారు విధాన‌మేంటీ..? హైద‌రాబాద్‌లోని ఇందిరా పార్క్ వ‌ద్ద ఉన్న ధ‌ర్నా చౌక్ విష‌యంలో ప్ర‌భుత్వం ఆలోచ‌న‌లు ఎలా మారుతున్నాయ‌నేదే… ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం!

ఏ పార్టీవారుగానీ, ఏ ప్ర‌జాలు సంఘాలుగానీ నిర‌స‌న‌లూ ఆందోళ‌న‌లు చేప‌ట్టాలంటే ఇందిరా పార్క్ ద‌గ్గ‌ర ఉన్న ధ‌ర్నా చౌక్‌లో కార్య‌క్ర‌మాలు పెట్టుకుంటారు. కొన్నేళ్లుగా జ‌రుగుతున్న‌ది ఇదే. తెరాస కూడా గ‌తంలో చాలాసార్లు ఇక్క‌డి నుంచే ఉద్య‌మించిన సంద‌ర్భాలూ ఉన్నాయి. అయితే, తాజాగా పోలీసు శాఖ‌వారు ప్ర‌తిపాదించింది ఏంటంటే… ధ‌ర్నా చౌక్‌ను ఇందిరా పార్క్ నుంచి మార్చేద్దామ‌నీ! న‌గ‌రానికి దూరంగా ఓ యాభై ఎక‌రాల భూమిని ధ‌ర్నా చౌక్ కోసం కేటాయిస్తే.. న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఉండ‌వ‌నీ, సామాన్య జ‌న‌జీవ‌నానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండ‌వ‌నీ అంటున్నారు!

అచాన‌క్‌.. సామాన్యుల ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నారే! ధ‌ర్నా చౌక్ వ‌ద్ద జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల వ‌ల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటున్నాయ‌ని ఇప్పుడే తెలిసిందా మ‌హాప్ర‌భూ…? స‌గ‌టు భాగ్య న‌గ‌ర జీవికి ఇవ‌న్నీ అల‌వాటైపోయిన అవ‌స్థ‌లు. ఎందుకంటే, న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య కావొచ్చు, రోడ్ల స‌మ‌స్య కావొచ్చు, వ‌ర్షాకాలంలో రోడ్ల‌పై ఎదురీత కావొచ్చు, కుళ్లిపోయిన నాలాల లీకులు కావొచ్చు… ఇవ‌న్నీ ఎప్ప‌టికీ ప‌రిష్కారం కావు, ప్ర‌భుత్వాల‌కు అంత ‘డాష్’ లేదు అనే ఒక స్థాయి న‌మ్మ‌కం సామాన్యుడికి వ‌చ్చేసింది! అనూహ్యమైన మార్పుల్ని ఎవ్వ‌రూ ఎక్స్‌పెక్ట్ చేయ‌డం లేదు. మ‌రి, ధ‌ర్నా చౌక్ మార్పు వెన‌క ‘సామాన్యుడి క‌ష్టాల తీర్చుడే ధ్యేయం’ అన్న‌ట్టు బిల్డ‌ప్పులు ఇస్తే ఎవ‌రు న‌మ్మేస్తారు..? ఇలాంటి నిర్ణ‌యాల వెన‌క రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ఉంటాయి. జ‌న ప్ర‌యోజ‌నాలు ఉండ‌వు!

ఈ మ‌ధ్య కోదండ‌రామ్ సాగించిన ఉద్య‌మ తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో ఈ నిర్ణ‌యంతోనే అర్థ‌మౌతోంది. తెలంగాణ‌లో రాబోయే రోజుల్లో నిర‌స‌న‌లు పెరుగుతాయ‌ని స్ప‌ష్ట‌మౌతోంది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌జ‌లు స్పందించ‌డం మొద‌లుపెట్టిన దాఖలాలు క‌నిపిస్తున్నాయి. ఆ అసంతృప్తి ధర్నాచౌక్ వ‌ర‌కూ రాకూడ‌దనేది కేసీఆర్ విజ‌న‌రీ వ్యూహం! అందుకే, న‌గ‌రానికి దూరంగా ఎక్క‌డో కొంత ప్లేస్ ఇచ్చేస్తే… ఆ గోలేదో అక్క‌డితోనే పోతుందని అనుకుంటున్నారు! ‘డీల్’ చేయ‌డానికి ప్ర‌భుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది క‌దా! ధ‌ర్నా చౌక్ మార్పు వెన‌క ఇంత‌కుమించిన ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు! ఇది ప్ర‌జాప్ర‌యోజనం కోసం కాదు… కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోస‌మే..! మ‌రి, ఈ ప్ర‌తిపాద‌నపై మున్ముందు చోటు చేసుకునే ప‌రిణామాలు ఎలా ఉంటాయో…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close