‘ధోనీ’ సినిమాకు తెర వెనుక నిర్మాత ధోనీనేనా?

క్రికెట్ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ధోనీ టాలెంట్‌ని తక్కువ చేసే ప్రయత్నం ఎవ్వరూ చేయలేరు కానీ ఆటతో పాటు ధోనీకి ఇంకో అద్భుతమైన టాలెంట్ కూడా ఉంది. 1983లో కష్టపడి వరల్డ్ కప్ గెలిచిన కపిల్ అండ్ కో సంపాదించుకుంది ఏమీ లేదు. క్రికెట్‌ని పాపులర్ చేయడంలో మాత్రం వాళ్ళ కష్టం చాలా చాలా ఉంది. ఇండియాలో ఓ క్రికెట్ ప్లేయర్ ఏ రేంజ్‌లో సంపాదించుకోవచ్చు అన్న విషయాన్ని ప్రాక్టికల్‌గా చేసి చూపించాడు సచిన్ టెండూల్కర్. ప్రపంచంలోనే ది బెస్ట్ బ్యాట్స్‌మేన్‌గా పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రపంచంలో ఉన్న క్రికెటర్స్ అందరికంటే కూడా ఎక్కువ సంపాదించుకున్న క్రికెటర్‌గా కూడా టెండూల్కర్ పేరు గడించాడు. అయితే అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా దాదాపుగా దశాబ్ధం పైగానే ఆడిన టెండూల్కర్ ఎంత సంపాదించాడో అంత డబ్బులను చాలా తక్కువ టైంలోనే సంపాదించేశాడు ధోనీ. బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుకోవడంలో మిగతా క్రికెటర్స్ అందరి కంటే కూడా ధోనీ చాలా చాలా ముందున్నాడు. తనకు పేరు ఎక్కువ వచ్చేలా చేసుకోవడంలో కూడా ధోనీకి చాలా తెలివితేటలు ఉన్నాయి. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్‌ను కాదని తనే ముందు దిగడంలోనే ధోనీ తెలివితేటలు తెలిసిపోతున్నాయి. కానీ మీడియా రిలేషన్స్ విషయంలో తన పలుకుబడిని ఉపయోగించి తన స్వార్థం గురించిన విమర్శలు మరీ ఎక్కువ రాకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడు ధోనీ.

ఇప్పుడు సినిమా ఐడియా కూడా ధోనీదే అని తెలుస్తోంది. రిటైర్మెంట్‌కి దగ్గరవుతున్న ఈ సమయంలో తన పేరు శాశ్వితంగా నిలబడిపోవాలంటే ఇండియా మొత్తం రిలీజ్ అయ్యేలా తన జీవిత కథతో సినిమా రూపొందితే బాగుంటుందని భావించాడు ధోనీ. తనకు సన్నిహితుడు అయిన అరుణ్ పాండేతో తన ఆలోచన పంచుకున్నాడు ధోనీ. ఆ తర్వాత మిగతా వ్యవహారాలన్నీ అరుణ్ పాండేనే చూసుకున్నాడని తెలుస్తోంది. ‘ఎం.ఎస్. ధోనీ’ సినిమాకు అరుణ్ పాండే సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు సినిమా పబ్లిసిటీ కోసం కూడా సినిమా డైరెక్టర్, హీరోల కంటే ధోనీనే ఎక్కువ కష్టపడుతున్నాడు. స్టార్ హీరోలు వాళ్ళ సినిమాల గురించి చెప్పుకున్నట్టుగా ‘ధోనీ’ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పేస్తున్నాడు. క్రికెట్ ప్రేమికులకు, విశ్లేషకులకు కూడా తెలియని ఎన్నో విషయాలు సినిమాలో ఉన్నాయని చెప్తూ సినిమా పైన ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బ్రాండ్ వ్వాల్యూ పెంచుకోవడం, ఎండార్స్‌మెంట్స్ విషయంలో ధోనీ తెలివితేటల గురించి అవగాహన ఉన్నవాళ్ళందరూ కూడా ఈ సినిమాను కచ్చితంగా ధోనీనే ప్రొడ్యూస్ చేసి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సినిమా పబ్లిసిటీ కోసం ధోనీ పడుతున్న తాపత్రయం చూస్తుంటే కూడా అది నిజమేననిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close