‘డిక్టేటర్‌’కి స్పెషల్ డిస్కౌంట్‌ ప్రకటించిన నిర్మాతలు!

సంక్రాంతి ప్రతి సంవత్సరం వస్తుంది. అలాగే ప్రతి సంక్రాంతికి రెండు, మూడు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌ అవ్వడం కూడా మామూలే. కానీ, ఈ సంక్రాంతి అలా లేదు. పండగ హడావిడి అంతా సినిమాలదే. 13న ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో’, 14న బాలకృష్ణ ‘డిక్టేటర్‌’, 15న నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాలు బరిలో వున్నాయి. ఈ మూడు సినిమాల మధ్యలో నేనూ వున్నానంటూ శర్వానంద్‌ కూడా దూరాడు. 14న శర్వానంద్‌ సినిమా ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ కూడా రిలీజ్‌ అవుతోంది. సాధారణంగా ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటేనే థియేటర్ల ప్రాబ్లమ్‌ వచ్చేస్తుంది. కానీ, నాలుగు సినిమాలు రిలీజ్‌ అయినా థియేటర్ల ప్రాబ్లమ్‌ వచ్చే అవకాశం లేదని ట్రేడ్‌వర్గాలు చెప్తున్నాయి. సినిమాలను నిర్మాతలు రిలీజ్‌ చెయ్యడం, ఆడియన్స్‌ చూసేసి తీర్పు చెప్పెయ్యడం వరకు మామూలే. కానీ, ఒక సినిమా నిర్మాత నుంచి థియేటర్‌ వరకు రావాలంటే కంటి మీద కునుకు వుండదు.ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇబ్బందులు రౌండ్ టేబుల్ సమావేశాలు, వుంటాయనేది ఆయా చిత్రాల నిర్మాతలకు, బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మాత్రమే తెలుస్తుంది.

ఈ పండగకు రిలీజ్‌ అవుతున్న సినిమాల్లో బాలకృష్ణ ‘డిక్టేటర్‌’కి ఒక కొత్త సమస్య వచ్చిపడింది. ఈ సినిమా బిజినెస్‌ చాలా కాలం క్రితమే కంప్లీట్‌ అయింది. నిర్మాతలకు టేబుల్‌ ప్రాఫిట్‌తో సంతృప్తికరమైన బిజినెస్‌ జరిగింది. ఇప్పుడొచ్చిన చిక్కేమిటంటే థియేటర్లు దొరక్కపోవడం. ఈ సినిమాకి సంబంధించి బిజినెస్‌ కంప్లీట్‌ అయినపుడు థియేటర్ల కోసం ఇంత హెవీ కాంపిటీషన్‌ వుంటుందని బయ్యర్లు ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు. ఈ కాంపిటీషన్‌ని క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్న ఎగ్జిబిటర్లు బయ్యర్లతో బేరాలు ఆడడం మొదలుపెడుతున్నారు. అడ్వాన్స్‌లు అంత ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు. పైగా మీ సినిమా కాకపోతే ఇంకా మూడు సినిమాలు వున్నాయి. ఏదో ఒకటి వేసుకుంటామని ధీమాగా చెప్తుండడంతో బయ్యర్లలో టెన్షన్‌ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతకు కట్టాల్సిన డబ్బు విషయంలో కాస్త వెనకా ముందు అన్నట్టుగా వున్నారు బయ్యర్లు. ఈ వ్యవహారం దర్శకనిర్మాత శ్రీవాస్‌ దృష్టికి వెళ్ళడంతో ఈరోస్‌ సంస్థ ప్రతినిధులతోకలిసి, హీరో బాలకృష్ణతో డిస్కస్‌ చేసి ఇప్పటివరకు ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. బయ్యర్లతో చేసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం వాళ్ళు కట్టాల్సిన మొత్తంలో 15 శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో తాము డిస్కౌంట్‌ ఇవ్వకపోయినా రిలీజ్‌ ముందురోజు తక్కువ ఎమౌంటే కడతారు కాబట్టి ఈ డిస్కౌంట్‌ స్కీమ్‌ని ప్రవేశపెట్టారు. డిస్కౌంట్‌ ఇచ్చిన తర్వాత ఎమౌంట్‌ తగ్గించి కడితే కుదరదు అని ముందే కండీషన్‌ పెట్టారట. అనుకోకుండా వచ్చిన డిస్కౌంట్‌పై బయ్యర్లు చాలా హ్యాపీగా వున్నారట. ఏది ఏమైనా ‘డిక్టేటర్‌’ విషయంలో హీరో బాలకృష్ణ, దర్శకనిర్మాత శ్రీవాస్‌, ఈరోస్‌ సంస్థ ఈ డిస్కౌంట్‌ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమేనని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close