బాల‌య్య‌, చిరుల కోస‌మే వెన‌కడుగు వేశాం: దిల్ రాజు

11న రావాల్సిన‌ వార‌సుడు వెన‌క్కి వెళ్లింది. ఈ సినిమాని 14న విడుద‌ల చేస్తున్న‌ట్టు దిల్ రాజు ప్ర‌క‌టించారు. ఏపీ, తెలంగాణ‌ల‌లో… చిరంజీవి, బాల‌కృష్ఱ చిత్రాల‌కు ఎక్కువ థియేట‌ర్లు క‌ల్పించాల‌న్న ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు చెప్పుకొచ్చారు దిల్ రాజు. అయితే త‌మిళంలో మాత్రం ఈనెల 11నే వార‌సుడు వ‌స్తోంది. రెండు రోజులు ఆల‌స్యంగా తెలుగులో విడుద‌ల అయినంత మాత్రాన‌.. త‌న సినిమాకొచ్చే న‌ష్టం ఏమీ లేద‌ని, సినిమాపై న‌మ్మ‌కంతోనే… ఆల‌స్య‌మైనా చూస్తార‌న్న ధీమాతోనే వాయిదా వేశామ‌ని క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. రిలీజ్ డేట్ మార్పు విష‌యంలో ఇండ‌స్ట్రీలోని పెద్ద‌లంద‌రితోనూ చ‌ర్చించాన‌ని, వాళ్లు త‌న నిర్ణ‌యాన్ని హ‌ర్షించార‌ని చెప్పుకొచ్చారు.

ఈనెల 12న వీర సింహారెడ్డి, 13న‌.. వాల్తేరు వీర‌య్య విడుద‌ల అవుతున్నాయి. వీటి మ‌ధ్య వార‌సుడు వ‌స్తోంది. రెండు తెలుగు సినిమాలు ఉండ‌గా, ఓ డ‌బ్బింగ్ సినిమాకి థియేట‌ర్లు ఎందుకు ఇవ్వాలి? అంటూ మిగిలిన నిర్మాత‌లూ, డిస్టిబ్యూట‌ర్లూ దిల్ రాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో.. జ‌న‌వ‌రి 11న త‌న సినిమాని విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు దిల్ రాజు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ విడుద‌ల తేదీలో మార్పు వ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close