రామ్ చ‌ర‌ణ్ సినిమా అత‌నితోనా… ఛాన్సే లేదు

సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌. ఈ రెండు సినిమాలూ సూప‌ర్ హిట్ అయ్యాయి. దిల్‌రాజు కూడా.. త్రినాథ‌రావు టాలెంట్‌పై న‌మ్మ‌కం ఉంచి, మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఓ స్టార్ హీరో కోసం త్రినాథ‌రావు ఓ క‌థ సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ హీరో.. రామ్ చ‌ర‌ణ్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కాంబోపై సినిమా గురించి దిల్ రాజు స్పందించాడు. ”రామ్ చ‌ర‌ణ్‌తో ఓ సినిమా, త్రినాథ‌రావుతో ఓ సినిమా ఉంటుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మాత్రం సినిమా అనుకోవ‌డం లేదు. చ‌ర‌ణ్ కోసం కొన్ని క‌థ‌లు సిద్థ‌మ‌వుతున్నాయి. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడే చెప్ప‌లేను. 2018లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది” అంటూ క్లారిటీ ఇచ్చేశాడు దిల్ రాజు. ఆయ‌న కాంపౌండ్‌లో ద‌ర్శ‌కుల‌కు కొద‌వ‌లేదు. హిట్ సినిమా ఇచ్చినా, ఫ్లాప్ ఇచ్చినా ఆ కాంపౌండ్ వ‌దిలిపెట్ట‌డానికి ద‌ర్శ‌కులు ఇష్ట‌ప‌డ‌రు. ఫ్లాప్ ద‌ర్శ‌కుడికి ఓ హిట్ ఇచ్చి మ‌రీ ఆ కాంపౌండ్ నుంచి బ‌య‌ట‌కు పంపిస్తుంటారు. అలాంటి ఓ ద‌ర్శ‌కుడితోనే.. చ‌ర‌ణ్ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. త్రినాథ‌రావు ఆల్రెడీ హిట్టు కొట్టేశాడు కాబ‌ట్టి.. ఆయ‌న పేరు ఈ లిస్టులోంచి మిన‌హాయించొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com