దిల్‌రాజు గారూ.. మీరే అలా అంటే ఎలా..??

చిన్న సినిమాల‌వైపు సినిమా రంగం మొత్తం త‌లెత్తుకుని చూస్తోంది. చిన్న సినిమాల‌తో అద్భుతాలు సృష్టించొచ్చ‌ని న‌మ్ముతోంది. కాక‌పోతే కావ‌ల్సింద‌ల్లా… బ‌ల‌మైన క‌థే. దిల్‌రాజు కూడా చిన్న సినిమాలతో ఎదిగిన‌వాడే. చిన్న సినిమాల్నీ, కొత్త ద‌ర్శ‌కుల్ని, కొత్త టాలెంటునీ ప్రోత్స‌హించిన వాడే. బొమ్మ‌రిల్లు, కొత్త‌బంగారు లోకం చిన్న సినిమా కాదా? ఆ సినిమాల‌తో దిల్‌రాజు సంస్థ ప‌ర‌పతి పెర‌గ‌లేదా? అలాంటి దిల్‌రాజునే ఇప్పుడు ‘చిన్న‌ సినిమాల‌తో వేగ‌డం క‌ష్టం’ లాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చాడు. కొత్త వాళ్ల‌తో సినిమాలు తీసి, జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సివ‌స్తోంద‌ని, అదేదో… మినిమం రేంజున్న హీరోతో సినిమా తీస్తే ఆ రిస్కు త‌ప్పుతుంద‌ని, టైమ్ కూడా క‌లిసొస్తుంద‌ని సెల‌విచ్చాడు. అంతేకాదు… త‌న కేరింత సినిమాని ఉదాహ‌ర‌ణ‌గా నిలిపాడు. రీషూట్లు చేసి మ‌రీ ఓ సినిమాని సిద్ధం చేస్తే, టాక్ బాగున్నా జ‌నాలు థియేట‌ర్ల‌కు రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అందుకే కొత్త వాళ్ల‌తో సినిమా తీయ‌డానికి భ‌య‌ప‌డుతున్నాడ‌ట‌.

హ్యాపీడేస్‌కి మ‌రో రూపం కేరింత‌. అంత‌కు మించిన స్పెషాలిటీ ఆ సినిమాలో లేదు. అందుకే ప్రేక్ష‌కులు దాన్ని తిప్పికొట్టారు. చిన్న సినిమాల‌కు `దిల్ రాజు` పేరే బ్రాండ్‌. దాంతో జ‌నాలు రావాలి. వ‌స్తున్నారు కూడా. క‌థ‌లో బ‌లం లేక‌పోతే జ‌నం ఎలా చూస్తారు?? చిన్న సినిమా తీస్తే జ‌నాన్ని థియేట‌ర్ల‌కు క‌ష్ట‌మ‌న్న‌ది దిల్‌రాజు మాట‌. మ‌రి ఆర్‌.ఎక్స్ 100ని జ‌నం అలా ఎగ‌బ‌డి ఎందుకు చూస్తున్నారు? పెళ్లి చూపులు లాంటి సినిమాల్ని ఎలా చూడ‌గ‌లిగారు? అంటే ఇక్క‌డ లోపం చిన్న సినిమాలో లేదు. స్ట్రాట‌జీలో ఉంది. దిల్‌రాజు దృష్టంతా కేవలం పెద్ద సినిమాల‌పై ప‌డింద‌ని, చిన్న సినిమాల్ని ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అందుకే అవి గాడి త‌ప్పుతున్నాయ‌న్నది ఫిల్మ్‌న‌గ‌ర్ మాట‌. దాన్ని ఇలా క‌వ‌ర్ చేసుకుంటున్నాడ‌న్న‌మాట‌. దిల్ రాజులాంటి స్టార్ నిర్మాత‌లు, అనుభ‌వ‌జ్ఞులే చిన్న సినిమాల‌పై ఇలాంటి నెగిటీవ్ స్టేట్‌మెంట్లు ఇస్తే… కొత్త‌గా ఈ రంగంలోకి అడుగుపెట్టి, చిన్న సినిమాల‌తో నిరూపించుకోవాల‌ని అనుకున్న వారి సంగ‌తేంటో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close