ప‌వ‌న్‌పై దిల్‌రాజు విసురుతున్న‌ బాణం

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఓ సినిమా చేయాల‌న్న‌ది దిల్‌రాజు ల‌క్ష్యం. అందుకు చాలా చాలా ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఆఖ‌రికి మీతో సినిమా చేయాల‌ని వుంది.. కాల్షీట్లు ఇస్తారా? అంటూ చాలాసార్లు అడిగాడు కూడా. అన్నింటికీ ప‌వ‌న్ స‌మాధానం ఒక్క‌టే. మంచి క‌థ ఉంటే చెప్పండి, చేస్తా అని. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు స్టోరీ ముందు ప‌వ‌న్‌కే వినిపించారు. కానీ ఎందుక‌నో ప‌వ‌న్ డ్రాప్ అయ్యాడు. అప్ప‌టి నుంచీ దిల్‌రాజు త‌న‌వంతుగా ప్ర‌య‌త్నాల మీద ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. ప‌వ‌న్‌ని ప‌డ‌గొట్టాలంటే మంచి క‌థ ఉండాల‌ని తెలుసుకొన్న దిల్ రాజు.. అందుకు త‌గిన స‌రంజామా సిద్ధం చేసుకొని.. ఓ ద‌ర్శ‌కుడ్ని ప‌వ‌న్‌పైకి బాణంలా విస‌ర‌బోతున్నాడు. త‌నే… హ‌రీష్ శంక‌ర్‌.

హ‌రీష్‌.. దిల్‌రాజు కాంపౌండ్ వ్య‌క్తే. అక్క‌డే ఎదిగాడు.. అక్క‌డే నేర్చుకొన్నాడు. దిల్‌రాజుతో రెండు సినిమాలు చేశాడు. ప‌వ‌న్‌తో తీసిన గ‌బ్బ‌ర్ సింగ్ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్టు కొట్టింది. ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ కోసం ఓ క‌థ రెడీ చేసుకొన్నాడ‌ట‌. అది దిల్ రాజుకీ బాగా న‌చ్చేసింద‌ని టాక్‌. ఈ క‌థ‌తో ప‌వ‌న్‌ని ప‌డ‌గొట్టాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నం. మ‌రోవైపు హ‌రీష్ కూడా ప‌వ‌న్‌తో మ‌రో సినిమా చేయాల‌ని తెగ ఉబ‌లాట ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ ప‌వ‌న్‌ని క‌లిసి క‌థ వినిపించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని టాక్‌. మ‌రి అవి ఏమాత్రం విజ‌య‌వంతం అవుతాయోతెలియాలంటే ఇంకొన్నాళ్లు ఓపిక ప‌ట్టాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close