భాజాపా నేత త‌ప్పును నిల‌దీసిన‌ సినిహీరో…

రాజ‌కీయ నాయ‌కులకు కాస్త అవ‌కాశం దొరికితే ఆగ‌రు. పైగా త‌మ నాయ‌క భ‌క్తి నిరూపించుకునే సంద‌ర్భం అయితే ఇక వారిని నిలువ‌రించ‌డం దాదాపు అసాధ్యం. అలాంటి ప‌రిస్థితుల్లోనే ఒక్కోసారి నోరు జారి నిజం మాట్లాడేస్తుంటారు. ఇరుకున ప‌డుతుంటారు. అదే జ‌రిగింది త‌మిళ‌నాడుకు చెందిన భాజాపా నేత హెచ్‌. రాజా విష‌యంలో.

తాజాగా విజ‌య్ సినిమా మెర్స‌ల్ కు సంబంధించిన వివాదంలో ఇదంతా త‌మ నేత మోడీకి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న కుట్ర అంటూ వ్యాఖ్యానిస్తూ మాట్లాడిన రాజా… ఆ సినిమాకు సంబంధించి న‌టీన‌టులు, నిర్మాత‌పై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌ల‌కు దిగిన విష‌యం విదితమే. అదే క్ర‌మంలో ఆయ‌న ఆ సినిమాను తాను చూశాన‌న్నారు. అంత వ‌ర‌కూ బానే ఉంది కానీ… ఆ సినిమాను ఇంట‌ర్నెట్‌లో చూశాను అన‌డ‌మే ఆయ‌న ఆవేశంలో నోరుజారి చేసిన త‌ప్పు.

దీన్ని త‌మిళ హీరో, త‌మిళ నిర్మాతల మండ‌లి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కూడా అయిన‌ విశాల్ ఠ‌క్కున ప‌ట్టుకున్నాడు. భాజాపా పార్టీకి చెందిన అగ్ర‌నేత అలా బ‌హిరంగంగా తాను పైర‌సీ సినిమా చూశానంటూ చెప్ప‌డం దేనికి ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుందంటూ విశాల్ సూటిగా ప్ర‌శ్నించాడు. త‌న లాంటి సామాన్య వ్య‌క్తే ఏదైనా ప‌ని చేసేట‌ప్పుడే త‌ప్పా ఒప్పా అని ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తాన‌ని, అలాంటిది అంత ప్ర‌ముఖులై ఉండీ మీరీ ప‌ని చేయ‌డం ఏమిట‌ని నిల‌దీశాడు. చ‌ట్టాలు అమ‌లు చేయ‌డంలో ముందుండాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధి అయి ఉండీ ఇలా చేయ‌డం అంటే సామాన్య ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు పంప‌డం కాదా? అని ఆవేదన వెలిబుచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close