ఎవ‌డండీ ఈ దేవిశ్రీ ప్ర‌సాదూ…?

చిన్న సినిమాల స‌క్సెస్ సీక్రెట్ ఒక్క‌టే. ఓ మంచి టైటిల్ తో జ‌నాల్ని ఆక‌ర్షించ‌డం.. ఆ త‌ర‌వాత కంటెంట్‌తో వాళ్ల‌ని థియేట‌ర్లో కూర్చోబెట్ట‌డం. ఈ రెండు విష‌యాల్లో స‌క్సెస్ అయితే చిన్న సినిమానీ పెద్ద సినిమాగా మార్చుకోవొచ్చు. ఇప్పుడొక టైటిల్ ఇలానే టాలీవుడ్‌లో ఆస‌క్తిని రేపుతోంది. అదే… దేవిశ్రీ ప్ర‌సాద్‌. సంగీత ద‌ర్శ‌కుడిగా దేవిశ్రీ ప్ర‌సాద్ పాపుల‌ర్‌! ఆ పేరు తెలియ‌ని వాళ్లుండ‌రు.కానీ.. ఈ పేరుని టైటిల్‌గా మార్చుకొని ఓ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకీ దేవిశ్రీ ప్ర‌సాద్‌కీ ఏ విధ‌మైన సంబంధం లేదు. పైగా మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా కూడా కాదు. ఇదో హార‌ర్ మూవీ.

శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఇది వ‌ర‌కు స‌శేషం, భూ సినిమాల్ని తెర‌కెక్కించాడు. రెండూ థ్రిల్ల‌ర్ చిత్రాలే. ముచ్చ‌ట‌గా మూడోసారీ అలాంటి ప్ర‌య‌త్న‌మేచేశాడు. టైటిల్‌తో కూడిన పోస్ట‌ర్ ఈమ‌ధ్యే బ‌య‌ట‌కు వ‌చ్చింది. దేవిశ్రీ ప్ర‌సాద్ అన‌గానే.. ఆ టైటిల్ అంద‌రికీ న‌చ్చేసింది. దేవి, శ్రీ‌, ప్ర‌సాద్ అనే ముగ్గురి క‌థ ఇది. అందుకే ద‌ర్శ‌కుడు తెలివిగా ఆ పేరు పెట్టాడు. టైటిల్ వ‌ర‌కూ బాగానే ఆలోచించాడు. మ‌రి కంటెంట్ ఎలా ఉంటుందో? అక్క‌డా ఓకే అనిపిస్తే, చిన్న సినిమా.. పెద్ద సినిమాగా మార‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close