తేజ టైటిల్‌: అలివేలు – వెంక‌టర‌మ‌ణ‌

తేజ టైటిళ్లు వెరైటీగా ఉంటాయి. చిత్రం, నువ్వూ నేను, జ‌యం, ల‌క్ష్మీ క‌ల్యాణం – ఇలా సింపుల్ పేర్ల‌తోనే అద్భుతాలు సృష్టించారు. రానా కోసం `రాక్ష‌స రాజు రావ‌ణాసురుడు` (RRR) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు `అలివేలు – వెంకట‌ర‌మ‌ణ‌` అనే కొత్త టైటిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది గోపీచంద్ కోసం తేజ త‌యారు చేసుకుంటున్న సినిమాకి టైటిల్‌. అవును.. తేజ – గోపీచంద్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇప్ప‌టికే క‌థ రెడీ అయ్యింది. అయితే ముందుగా రానా సినిమానే మొద‌ల‌వుతుంద‌ని, ఆ త‌ర‌వాత గోపీచంద్ సినిమాని మొద‌లెడ‌తార‌ని తెలుస్తోంది. ఇప్పుడు తేజ ఫోక‌స్ అంతా `రాక్ష‌స రాజు రావ‌ణాసురుడు`పైనే ఉంది. ఈ సినిమా కోసం న‌టీన‌టుల్ని, సాంకేతిక నిపుణుల్నీ ఎంపిక చేసుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు తేజ‌. రానా సినిమా పూర్త‌య్యాకే.. గోపీచంద్ సినిమాపై ఫోక‌స్ పెడ‌తారు. కాక‌పోతే ఈలోగా టైటిల్‌ని రిజిస్ట‌ర్ చేయించేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close