రాహుల్ ఎదురుప‌డి అడిగితే ఉత్త‌మ్ ఏం చెప్పారు..?

తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి దాదాపుగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌ప్పుకున్న‌ట్టే! అసెంబ్లీ ఎన్నిక‌ల ప‌రాజ‌య భారంతో అప్పుడే త‌ప్పుకోవాల్సి ఉన్నా, హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక వ‌ర‌కూ లాక్కుంటూ వ‌చ్చారు. కానీ, సొంత ఇలాఖాలో ఓడిపోయాక పూర్తిగా ఉత్త‌మ్ చేతులు ఎత్తేశారు. కొత్త అధ్య‌క్షుడి ఎంపిక ఎంత త్వ‌ర‌గా జ‌రిగితే, త‌న‌కు అంత మ‌న‌శ్శాంతి అన్న‌ట్టుగా స‌న్నిహితులతో వాపోతున్న‌ట్టు కూడా కొన్ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. కొత్త‌వారు వ‌చ్చేవ‌ర‌కూ పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగాల్సి ఉన్నా… ఇప్ప‌టికే ఆ బాధ్యతల నుంచి తప్పేసుకున్నారు ఉత్త‌మ్‌. గ‌డ‌చిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆయ‌న బాధ్య‌తాయుతంగా పార్టీని న‌డిపించ‌లేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. అయితే, హైక‌మాండ్ దృష్టిలో ఉత్త‌మ్ ఇంకా క్రియాశీలంగా ఉన్నార‌నే ఉంద‌ట‌!

ఈ మ‌ధ్య పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో రాహుల్ గాంధీకి ఉత్త‌మ్ ఎదురుప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా.. రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది ఉత్త‌మ్ జీ అని రాహుల్ ప్ర‌శ్నించారు. పార్టీ ప‌రిస్థితి ఎలా ఉందో చెప్పండి అన్నారు. దీంతో ఉత్త‌మ్… మీతో ప్ర‌త్యేకంగా మాట్లాడాలి, కొంత స‌మ‌యం ఇవ్వండి అన్నార‌ట‌. ఆ త‌రువాత‌, రాహుల్ తో మాట్లాడుతూ… పార్టీని అధికారంలోకి తీసుకుని రావ‌డంలో విఫ‌ల‌మైయ్యామనీ, అయితే తెరాస‌కు ధీటైన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నిల‌బెట్టామ‌న్నార‌ని స‌మాచారం. రాష్ట్రంలో పూర్తిగా క‌నుమ‌రుగైపోతున్న ద‌శ‌లో మూడు ఎంపీ స్థానాల‌ను గెలిపించాన‌ని ఉత్త‌మ్ చెప్పిన‌ట్టు తెలిసింది. పార్టీ ప‌రిస్థితి చెప్ప‌మంటే, తాను పార్టీకి చేసిన సేవ‌ల గురించి ఉత్త‌మ్ ఇలా చెప్తున్నారేంట‌ని రాహుల్ కాస్త ఆశ్చ‌ర్య‌పోయార‌ని స‌మాచారం.

ఈ మ‌ధ్య వ‌రుస‌గా ఉత్త‌మ్ మీద వీహెచ్ లాంటి నేత‌లు హైక‌మాండ్ కి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ ప్ర‌శ్నించారనీ, ఈ గొడవల్ని చక్కదిద్దారా అనేది రాహుల్ అంతరంగమనీ… అయితే ఇదే విష‌యం ఉత్త‌మ్ కి తెలిసినా… బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోబోయేముందు ఈ అంశాల‌కు ఎందుకు అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌నే ధోర‌ణిలోనే రాహుల్ తో ఉత్త‌మ్ అలా మాట్లాడారనీ అనుకోవ‌చ్చు. ఏదేమైనా, వీలైనంత త్వ‌ర‌గా త‌ప్పుకోవాల‌న్న ఆతృత ఆయ‌నలో క‌నిపిస్తోంద‌ని సొంత పార్టీ నేత‌లే కొంద‌రు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close