డిజే పైరసీ …. పవన్ ఫ్యాన్స్ పై అనుమానమా ?

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో కొన్ని ఫ్యాన్స్ గ్రూప్ పేజీలపై కూడా కంప్లైంట్ చేసిన నిర్మాతలు :

సినిమా వాళ్ళకి సినిమా వాళ్ళే శత్రువులు. బయటవారికి ఆ అవకాశం ఇవ్వరు. పైపైన ‘మేమంతా ఒక్కటే’ అని చెప్పుకున్నా లోలోప ఈగోలతో మండిపొతుంటారు. ఆ మంటను అప్పుడప్పు తమ సినిమాలోనే ఎదుటివారిపై సెటైర్లుగా పెట్టుకొని ఆనందం పొందుతుంటారు. సినిమా పరిశ్రమలో వున్నంత హిప్పోక్రసి మరే పరిశ్రమలో కనిపించదు. ఎవరికీ వారే గ్రూపులుగా వుంటారు. అభిమానులతో గ్రూపులు కట్టించేస్తారు. తేడాలు వస్తే అభిమానులు సోషల్ మీడియాలు వేదికాగా ప్రతాపాలు చూపిస్తారు. ఆ చోద్యం చూస్తూ కూర్చుంటారు సినీ ఘనులు.

ఎంత వద్దు అనుకున్నా సినీ ప్రముఖులు ఇచ్చే ఒకొక్క స్టేట్మెంట్ ఇలాంటి చర్చను లేవదీస్తూనే ఉటుంది. తాజాగా అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమా పైరసీ బారిన పడింది. సినిమా మొత్తం పేస్ బుక్ లో పెట్టేశారు. దీనిపై దిల్ రాజు ఎండ్ కో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన ఓ కామెంట్ చాలా తేడాగా వుంది. ”దువ్వాడ జ‌గ‌న్నాథమ్’ కు వస్తున్న వసూళ్లను కొందరు చూసి ఓర్వలేక‌పోతున్నారని, కుళ్ళుకుంటున్నారని, అందుకే సినిమాని పేస్ బుక్ లో పెట్టేసి దెబ్బ కొట్టారని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

దిల్ రాజు మాట తేలిగ్గా తీసిపారేయలేం. ఆయనకి ఎదో సమాచారం వుండే ఈ మాట చెప్పారని అనుకోవాలి. అల్లు అర్జున్ సినిమాపై ఎవరికి పగ వుటుంది? పైరసీ అనేది ఒక దందా. అన్నీ సినిమాలు పైరసీ అయిపోతున్నాయి. బాహుబలి కూడా నెట్ లో ప్రత్యేక్షమైపోయింది. అప్పుడు రాజమౌళి కానీ ప్రభాస్ కానీ పగ లాంటి కామెంట్లు చేయలేదు. పైరసీ గానే చూశారు. మరి దిల్ రాజు అంటున్నట్లు బన్నీపై ఎవరికి పగ వుండాలి.?!

సినీయర్ స్టార్లు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. సినిమాల విషయానికి వస్తే ఇలాంటి గ్రూపులు గోల ఇప్పుడు లేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. వీళ్ళ గ్రూపుల గోలే ఎక్కువ. సోషల్ మీడియాలో నానా యాగీ చేస్తుంటాయి వీరి ఫ్యాన్స్ పేజీలు. అయితే డీజే విషయానికి వస్తే.. డిజే పైరసీ ని అరికట్టడంలో మహేష్ బాబు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సహాయపడ్డారట. దర్శకుడు హరీష్ శంకర్ ఈ విషయంలో మహేష్ , ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. సో.. డిజిని దెబ్బకొట్టే ఉద్దేశం వీరికి లేదు. మిగిలింది పవన్ కళ్యాణ్ , ప్రభాస్ గ్రూప్. ప్రభాస్ ఇలాంటి వాటికి చాల దూరం అనే అనుకోవాలి. ఆయన పనేదో ఆయనది. ఇండియన్ సినిమా రికార్డులు బద్దలుకొట్టేసి సినిమా అందించిన ప్రభాస్.. అభిమానులు అభిమానులు అనే హంగామలకు దూరంగా వుండి తన పనేదో తాను చూసుకుంటున్నాడు. కనీసం తన సినిమా నెంబర్ వన్ అని మాట వరసకి కూడా చెప్పలేదు ఇప్పటివరకూ. పైగా బన్నీతో ప్రభాస్ ఎప్పుడూ తగాదా లేదు.

ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అల్లు అర్జున్ -పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య యుద్దమే నడిచింది. ”చెప్పను బ్రదర్” అనే ఒక్క డైలాగ్ తో అల్లు అర్జున్ చాలా మూల్యం చెల్లించుకున్నాడు. బన్నీ ని చాలా ఇరిటేట్ చేసి పారేశారు ఆ డైలాగ్ తో. డిజే పై మొదటినుండి పవన్ ఫ్యాన్స్ గురి వుందని చెబుతారు. సినిమా టీజర్ కి ఎన్ని హిట్స్ వచ్చాయో అన్నీ డిస్ లైక్స్ వచ్చాయి. ట్రైలర్ కి కూడా. ఇదంతా చెప్పను బ్రదర్ ఎఫెక్ట్ ను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా విడుదల తర్వాత కూడా డిజే పై నెగిటివ్ ప్రచారం జరిపించారని, ఓ గ్రూప్ పనికట్టుకొని ఇది చెసిందని టాక్ వుంది. ఇప్పుడు దిల్ రాజు అల్లు అర్జున్ సినిమాను చూసి కొందరు ఓర్వలేక‌పోతున్నారని, అందుకే డిజే ని పైరసీ చేయించారని వ్యాఖ్యానించడం చర్చనీయంశమైయింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో కొన్ని ఫ్యాన్స్ గ్రూప్ పేజీలపై కూడా కంప్లైంట్ చేశారట. వీరందరికీ కఠిన చర్యలు తప్పవని దిల్ రాజు హెచ్చరించాడు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా పరోక్షంగా ఫ్యాన్స్ పేజీలపై మండిపడుతున్నాడు. అయితే పేరు మాత్రం నేరుగా చెప్పడం లేదు.మొత్తంమ్మీద ఈ వివాదంతో ఫ్యాన్స్ కాస్త పైరసీ నేరగాళ్ళు అయిపోయిన సీన్ కనిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com