అంత పెద్ద నేతను ఆమె పిల్లి అనేసిందే

ఆమె అంతే తెలంగాణ కాంగ్రెసు రాజకీయాల్లో ఆమె ప్రస్తుతానికి ఫైర్‌ బ్రాండ్‌. అధికార పార్టీని యథేచ్ఛగా విమర్శించాలంటే.. ఆమె తరువాతే ఎవరైనా. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనాలోచితంగా అనేయగలరు. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో రోజా ఎలాగైతే… తిట్లు లాంటి విమర్శలతో అధికార పార్టీకి గుబులు పుట్టిస్తూ ఉంటారో… ఇంచుమించుగా తెలంగాణ రాజకీయాల్లో ఆమె కూడా అంతే! తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గకపోవడంలో కూడా అంతే! ఆమె మరెవరో కాదు… కాంగ్రెసు మాజీ మంత్రి డీ కే అరుణ. ఇటీవల సభాపతి స్థానంలో ఉన్న పద్మా దేవేందర్‌ను సభలో అనుచితంగా మాట్లాడి వివాదాస్పదం అయిన డీకే అరుణ , కేసీఆర్‌ కేబినెట్‌ మంత్రిని ”జూలో పిల్లి” అని వ్యవహరించి మరో వివాదానికి తెర తీశారు.

తన సోదరుడు చిట్టెం రామ్మోహన రెడ్డి తెరాసలో చేరిన వ్యవహారానికి సంబంధించి ఆమె రెండు రోజులుగా కుతకుతలాడిపోతున్న సంగతి తెలిసిందే. ఆమె తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మీద ఉద్యమం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు టెండర్లలో భారీగా అవతకవకలు జరిగాయని, వీటిని వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదొక ఎత్తు అయితే సోదరుడు చిట్టెం పార్టీ మారడంపై ఆమె అసహనం గురించి మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఆమె ఎదుట ప్రస్తావించినప్పుడు.. జూపల్లి జూలో పిల్లి లాంటి వాడు.. అలాంటి వారి వ్యాఖ్యల గురించి నేనేమీ స్పందించను.. అని డీకే అరుణ తెగేసి చెప్పడం విశేషం. నా వ్యాఖ్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందిస్తే మాత్రమే నేను మాట్లాడతా అని ఆమె చెప్పడం విశేషం. డీకే అరుణ తనను తాను కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి స్థాయి నాయకురాలిగా భావిస్తారు. ఆమె విమర్శల మీద మాట్లాడడం అంటే.. తెరాస ముఖ్యమంత్రి ఒక్కరే స్పందించాలన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close