జ్యోతిల‌క్ష్మి ఆడియోకి వ‌చ్చింది కెల్వినేనా?

కెల్విన్‌… తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతున్న పేరు. ప్ర‌స్తుతం డ్ర‌గ్స్ కేసులో పేర్కొంటున్న 12మంది జాత‌కాలూ… కెల్విన్ చేతిలోనే ఉన్నాయి. పూరి జ‌గ‌న్నాథ్‌కీ, కెల్విన్‌కీ ద‌గ్గ‌ర సంబంధాలున్నాయ‌ని.. కెల్విన్ ద్వారానే టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా అవుతున్నాయ‌న్న‌ది సిట్ అధికారుల అనుమానం. ఈ నేప‌థ్యంలో ఓ ఆసక్తి క‌ర‌మైన వార్త చ‌క్క‌ర్లుకొడుతోంది. పూరి జ‌గ‌న్నాథ్‌ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ్యోతిల‌క్ష్మి ఆడియో ఫంక్ష‌న్‌కి కెల్విన్ కూడా వ‌చ్చాడ‌ని, పూరి – కెల్విన్‌ల బంధానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏముంద‌ని చెబుతూ.. సోష‌ల్ మీడియాలో ఓ ఫొటో చ‌క్క‌ర్లు కొడుతోంది. జ్యోతిల‌క్ష్మి ఆడియో వేదిక‌పై ఎర్ర రంగు చొక్కా వేసుకొన్న వ్య‌క్తి కెల్విన్ అంటూ ప్ర‌చారం సాగింది. దాంతో.. కెల్విన్ – పూరి బంధం నిజ‌మే అనే అనుమానం బ‌ల‌ప‌డింది. అయితే… ఇప్పుడు నాగ‌రాజు అనే ఓ వ్య‌క్తి.. ఈ ఫొటోలో ఉన్న‌ది కెల్విన్ కాదంటున్నాడు. మార్క్ చేసిన చిత్రంలో ఉన్న‌ది నేనే.. అంటూ స‌రికొత్త వాద‌న‌కు తెర‌లేపాడు. ‘నా ఫొటో చూపిస్తూ.. కెల్విన్ అంటున్నారేంటి?’ అంటూ ఓ దిన ప‌త్రిక‌కు ఫోన్ చేసి నిల‌దీశాడు నాగ‌రాజు. ఆయ‌న బెంగ‌ళూరులో ఉంటార‌ట‌. జ్యోతిల‌క్ష్మి ఆడియో వేడుక‌ల్లో తాను కూడా పాల్గొన్నాడ‌ట‌. త‌న ఫొటో చూపించి కెల్విన్ అన‌డం అన్యాయ‌మ‌ని.. వాదిస్తున్నాడు. కావాలంటే.. తానెవ‌రో ఎంక్వైరీ చేసుకోమ‌ని… త‌న ఫోన్ నెంబ‌రు కూడా స‌ద‌రు ప‌త్రిక‌కు ఇచ్చాడు. సో.. కెల్విన్ ఎపిసోడ్ కొత్త మ‌లుపు తిరిగిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com