టీఆర్ఎస్‌లో హరీష్‌ పని అయిపోయిందా..?

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. తను ప్రతి ఆదివారం రాసే.. కొత్తపలుకులో.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూంటారు. ఈ సారి… ఓ రకంగా కొంత సెన్సేషనల్ విషయన్నే వెల్లడించారు. అదే.. టీఆర్ఎస్‌లో హరీష్ రావు ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గిస్తూ పోవడం. ముందస్తుగా ఎన్నికలు జరిపి.. టీఆర్ఎస్‌ను గెలిపిచి.. కేటీఆర్‌ను.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టాలన్న లక్ష్యంతో.. కేసీఆర్ రాజకీయ చదరంగం ప్రారంభించారు. మామలుగా అయితే ఈ ఎన్నికల చదరంగంలో.. హరీష్ రావు.. అత్యంత కీలకంగా వ్యవహరించే వారు. అన్ని వ్యవహారాలు చక్క బెట్టేవారు. కానీ ఇప్పుడు హరీష్ రావు జాడ కనిపించడం లేదు. ఆయనకు పెద్దగా బాధ్యతలు ఇవ్వడం లేదు.

గతంలో ఉపఎన్నిక వచ్చినా.. బహిరంగసభలు నిర్వహించాలన్నా.. ముందుగా హరీష్ రావున పిలేచేవారు కేసీఆర్. కానీ.. కుమారుడికి పట్టం కట్టాలనుకుంటున్న ఆయన మెల్లగా హరీష్ రావు ప్రాధాన్యం…తగ్గిస్తూ వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పాతిక లక్షల మందితో… కొంగకలాన్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగసభ బాధ్యతలను… కేసీఆర్ .. తన కుమారుడు కేటీఆర్‌కే అప్పగించారు. మామూలుగా అయితే.. ఇలాంటి మెగా సభలు నిర్వహించే బాధ్యతను హరీష్ కు అప్పగిస్తారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి కేటీఆర్ వచ్చారు. ఆయనే సభ బాధ్యతలు తీసుకున్నారు. వరుసగా అన్ని జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ.. జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదొక్కటే.. కాదు.. ఇటీవలి కాలంలో నిజంగానే హరీష్ రావు ప్రాధాన్యం.. టీఆర్ఎస్‌లో తగ్గిపోయింది. ముఖ్యమంత్రి స్థాయి నిర్ణయాలన్నీ.. ఇప్పుడు కేటీఆర్‌ తీసుకుంటున్నారు. కేవలం ప్రాజెక్టుల విషయంపై మాత్రమే.. అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తూంటేనే.. హరీష్ రావు పూర్తిగా సైడైపోతున్నారన్న ప్రచారం టీఆర్ఎస్ లో ఊపందుకుంటోంది. దీనిపై హరీష్ స్పందన ఎలా ఉంటుందో కానీ… ఆయన అనుచరులను కూడా మెల్లగా దూరం పెడుతున్నారు. అంటే ఓ రకంగా.. ఇప్పుడు మిణుకు మిణుకు మంటున్నా.. వచ్చే ఎన్నికల తర్వాత హరీష్ రావు పని టీఆర్ఎస్‌తో అయిపోయినట్లేనన్న గుసగుసలు .. బయటకే వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close