ముద్రగడ ఉద్యమాలతో కాపులకి రిజర్వేషన్లు సాధ్యమేనా?

ముద్రగడ పద్మనాభం అధ్వర్యంలో నిన్న రాజమండ్రిలో 13జిల్లాలకి చెందిన కాపు సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు అందరూ తాము ముద్రగడ నేతృత్వంలో పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యమంలో చీలికలు తెచ్చి బలహీనపరచాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ కారణంగా తనని నిందిస్తున కాపు నేతలు ఎవరైనా ముందుకు వచ్చి ఉద్యమాన్ని కొనసాగించేందుకు ముందుకు వస్తే తను తప్పుకొంటానని అన్నారు. తనని ప్రభుత్వం ఎన్ని విధాలుగా అవమానిస్తున్నా, ఎంతగా వేధిస్తున్నా తట్టుకొని నిలబడుతూ తన లక్ష్యమైన కాపులకి రిజర్వేషన్లు సాధించడం కోసమే పోరాటం కొనసాగిస్తున్నానని అన్నారు. ప్రభుత్వానికి ఇచ్చిన గడువు పూర్తయిందని కనుక వెంటనే కాపులకి రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రకటన చేయాలని లేకుంటే మళ్ళీ ఉద్యమం మొదలుపెడతామని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కాపులకి రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో స్వయంగా చంద్రబాబు నాయుడే హామీ ఇచ్చిన మాట వాస్తవం. అధికారంలోకి రావడం కోసమే ఆయన పంట రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి వంటి అనేక వందలాది హామీలని ఇచ్చారు. కాపులకి రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ కూడా వాటిలో ఒకటి. ముద్రగడ పోరాటం మొదలుపెట్టే వరకు ఆ హామీని ఆయన పట్టించుకోకపోవడం ద్వారా దానిపై ఆయనకి చిత్తశుద్ధి లేదని స్పష్టం అయ్యింది.

ఆ తరువాత కూడా ఈ విషయంలో ప్రభుత్వం తీరు చాలా అనుమానాస్పదంగానే ఉంది. దాని కోసం మంజునాథ కమీషన్ ఏర్పాటు చేసింది కానీ అది ఇంకా పని మొదలుపెట్టనే లేదు. అది స్వయంగా జిల్లాలలో పర్యటించి కాపుల ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితులని అంచనా వేసి నివేదిక తయారుచేయాలి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాసాధికార సర్వే నివేదికల కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా అది తన నివేదికని తయారు చేయాలనుకోవడమే చాలా తప్పని చెప్పక తప్పదు. నేటికీ ఆ సర్వే సగం కూడా పూర్తి కాలేదు. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెపుతున్నప్పటికీ మరికొంత సమయం పట్టేట్లు కనబడుతోంది. అంటే మంజునాథ కమీషన్ నివేదిక కూడా అంతే ఆలస్యం కాబోతోందన్న మాట.

ఒకవేళ అది తన నివేదికలో కాపులకి రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాపులకి రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించలేదు. దాని కోసం అది శాసనసభలో తీర్మానం చేయాలి. అంటే మళ్ళీ శాసనసభ సమావేశం అయ్యేవరకు ఆగక తప్పదన్నమాట. శాసనసభలో ఆ తీర్మానాన్ని ఆమోదించిన తరువాత దానిని కేంద్రప్రభుత్వం ఆమోదం కోసం పంపిస్తుంది. అక్కడితో రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకోగలదు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ తదితర హామీల అమలుకోసం కేంద్రప్రభుత్వంపై తాము నిరంతం ఒత్తిడి చేస్తున్నట్లుగానే కాపులకి రిజర్వేషన్లు కోసం కూడా ఒత్తిడి చేస్తున్నామని చెపుతూ కాలక్షేపం చేసేయవచ్చు లేదా కాపులకి ఆగ్రహం కలిగించి వారికి దూరం కాకూడదని భావిస్తే కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి కాపులకి రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా చట్ట సవరణ చేయించవచ్చు. ఈలోగా ప్రత్యేకహోదా కారణంగా తెదేపా-భాజపాలు తెగతెంపులు చేసుకొంటే మిగిలిన హామీలలాగే కాపులకి రిజర్వేషన్ల అంశం కూడా కేంద్రప్రభుత్వం పరిశీలన జాబితాలోకి చేరిపోవచ్చు.కనుక కాపులకి రిజర్వేషన్లు మంజూరు అవడంఅనుమానమే.

వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఉద్యమాలు చేయడం వలన ఏమవుతుంది? అని ప్రశ్నించుకొంటే, ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమాల కారణంగా రాష్ట్రంలో అశాంతి పెరిగింది. ముద్రగడ ఉద్యమాలతో అది ఇంకా పెరుగుతుంది. తెదేపా ప్రభుత్వంపై కాపులలో వ్యతిరేకత పెరుగుతుంది. వారి వ్యతిరేకతని వైకాపాకి అనుకూలంగా మారవచ్చు కనుక దానికి వచ్చే ఎన్నికలలో ప్రయోజనం కలుగవచ్చు. లేదా ముద్రగడ స్వయంగా రాజకీయ పార్టీ స్థాపించుకొని ‘కింగ్ మేకర్’ గా ఎదుగవచ్చు. కాపులలో చాలా మంది తెదేపాకి కూడా అనుకూలంగా ఉన్నారు కనుక వారిలో చీలిక ఏర్పడేఅవకాశం ఉంటుంది. ఇప్పటికే వారిలో చీలిక వచ్చిందని ముద్రగడ మాటలే స్పష్టం చేస్తున్నాయి.

కనుక ఈ ఉద్యమం వలన కాపులకి రిజర్వేషన్లు రాకపోయినా ఏదో ఒక పార్టీకి లేదా నేతలకి ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనం కలుగవచ్చని స్పష్టం అవుతోంది. కనుక కాపులకి రిజర్వేషన్లు కోసం నిజంగా పోరాడదలచుకొన్నవారు ఈ రాజకీయ, సాంకేతిక అంశాలని కూడా ఆకళింపు చేసుకొని తదనుగుణంగా తమ కార్యాచరణ రూపొందించుకొంటే మంచిదేమో? లేకుంటే ఎవరికో రాజకీయ ప్రయోజనం కలిగించడం కోసం వృధా ప్రయాస పడినట్లవుతుంది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close