చిరంజీవి 150వ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణలు యాడ్ అవుతూ వస్తున్నాయి. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ ఓ ఐటెమ్ పాటలో చిందేసింది. రామ్‌చరణ్ చిరుతో కలసి ఓపాటలో స్టెప్పులు వేయబోతున్నాడు,. ఇప్పుడు మరో స్వీట్ న్యూస్ బయటకు వచ్చింది. చిరుపై ఓ డాక్యుమెంటరీ షో రీల్ రూపొందిస్తోంది చిత్రబృందం. 149 సినిమాలకు సంబంధించి ఇదోక ఏవీ అన్నమాట. నిమిషం వ్యవధిఉండే ఈ షో రీల్ ఖైదీ నెం.150 టైటిల్స్‌లో ప్రదర్శించనుంది చిత్రబృందం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వర్క్ జరుగుతోందట. చిరు సూపర్ హిట్ చిత్రాల నుంచి క్లిప్పింగులు సేకరించి ఈ ఏవీని రూపొందిస్తున్నారు. చిరు అభిమానులకు ఇది ఓ కానుక అనుకోవచ్చు.
చరణ్ ఇటీవలే ఖైదీ నెం.150లో చిరుతో కలసి స్టెప్పులు వేసేశాడు. వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, బన్నీ కూడా చిరు సినిమాలో కనిపించాలని ముచ్చట పడ్డారు. అయితే వారెవ్వరికీ అవకాశం రాలేదు. కానీ.. చిరు ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్లో మాత్రం ఈ మెగా హీరోలంతా కలసి సందడి చేసే అవకాశం ఉంది. కాజల్ కథానాయికగా నటించిన ఈ కత్తి రీమేక్ ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది. జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం. ఈనెల 25న ఆడియో రిలీజ్ కార్యక్రమం విజయవాడలో జరగనుంది.