ఇన్‌సైడ్ టాక్‌: అనుష్క‌కీ గాయ‌మైందా?

ఈమ‌ధ్య టాలీవుడ్ టైమ్ ఏమీ బాలేదు. గాయాల పాల‌వుతున్న క‌థానాయ‌కుల లిస్టు పెరుగుతోంది. రోజుకో ‘చేదు’ వార్త వినాల్సివ‌స్తోంది. యువ క‌థానాయ‌కులు కొంద‌రు ఆసుప‌త్రి పాల‌య్యారు. ఇంకొంద‌రు షూటింగుల‌కు దూర‌మ‌య్యారు. ఇప్పుడు మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌థానాయిక అనుష్క‌కీ గాయ‌మైంద‌ని. ఆమె కాలికి ప్రాశ్చ‌ర్ అయ్యింద‌ని, ప్ర‌స్తుతం న‌డ‌వ‌లేని స్థితిలో ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల `సైరా` సెట్లో పాల్లొంది అనుష్క‌. ఆ స‌మ‌యంలో న‌డ‌వ‌లేక ఇబ్బంది ప‌డింద‌ని స‌మాచారం. ‘సైరా’ షూటింగ్ ముగిసిన వెంట‌నే అనుష్క సినిమాల‌కు తాత్కాలికంగా విరామం ప్ర‌క‌టించింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం `సైలెంట్‌` సినిమాతో బిజీగా ఉంది స్వీటీ. ఈ షూటింగ్‌కి అనుష్క త‌ర‌చూ డుమ్మా కొడుతోంద‌ట‌. దానికి కార‌ణం.. కాలికి అయిన గాయ‌మే అని చెబున్నారు. ఇటీవ‌ల అనుష్క మరీ లావైపోయింది. ‘బాహుబ‌లి 2’లో బొద్దుగా ఉన్న అనుష్క‌నే చూడాల్సివ‌చ్చింది. అయితే ఆ త‌ర‌వాత‌.. బాగా స‌న్న‌బ‌డింది. ఇప్పుడు తాజాగా కాలికి గాయ‌మ‌వ్వ‌డంతో.. అనుష్క మళ్లీ బ‌రువు పెర‌గ‌డం మొద‌లెట్టింద‌ని చెబుతున్నారు. కాలి గాయం చిన్న‌దే కాబ‌ట్టి ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు పొక్క‌నివ్వ‌కుండా అనుష్క జాగ్ర‌త్త‌ప‌డుతుంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close