షారుక్‌తో పెట్టుకుంటే అంతే మరి

హైదరాబాద్: ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతోంది ‘ఖాన్’ త్రయం అన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి సూపర్ స్టార్‌ ఖాన్‌ లతో పెట్టుకుంటే ఏమవుతుంది. బాలీవుడ్‌లో పుట్టగతులుండవు. అర్జున్ రామ్‌పాల్, యోయో హనీసింగ్, ఫరా ఖాన్ వంటి వారు షారుక్ ఆగ్రహానికి గురయ్యి తీవ్రంగా నష్టపోయారు.

అర్జున్ రామ్‌పాల్ ఒక టైమ్‌లో షారుక్-కరణ్ జోహార్‌లతో సన్నిహితంగా ఉండేవారు. వరసగా సినిమాలలో బుక్ అవుతుండేవారు, బాలీవుడ్‌లో జరిగే పెద్ద పెద్ద పార్టీలన్నింటిలో కనిపిస్తుండేవారు. అయితే తర్వాత ఏమయిందో, ఏమోగానీ షారుక్‌కు, రామ్‌పాల్‌కు మధ్య చెడింది. అంతే! రామ్‌పాల్‌కు అవకాశాలు ఉన్నట్లుండి ఆగిపోయాయి. దానికితోడుగా – హృతిక్ రోషన్ మాజీ బార్య సుశేన్‌తో ఎఫైర్ ఉన్నట్లు పుకార్లు జోరుగా రావటం అతని కెరీర్‌ను మరింత దెబ్బతీసింది.

యోయో హనీసింగ్ పాట ఒక్కటైనా లేకుండా బాలీవుడ్‌లో భారీ సినిమాలేవీ ఉండేవికావు ఒక సమయంలో. అయితే కొన్ని నెలలుగా అతని పాట ఒక్కటికూడా కొత్త సినిమాలలో ఉండటంలేదు. షారుక్‌కు యోయో నచ్చకపోవటంతో ఇండస్ట్రీ అతనిని పక్కన పెట్టేసింది.

కొరియో గ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్‌కూడా ఒక సమయంలో బాలీవుడ్ బాద్షా ఆగ్రహాన్ని చవిచూశారు. తన చిత్రం తీస్‌మార్ ఖాన్‌లో నటించటానికి నిరాకరించటంతో షారుక్‌తో మళ్ళీ పనిచేయబోనని ఫరాఖాన్ శపథం చేశారు. ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవటం, ఆమె భర్త శిరీష్ కుందర్‌పై షారుక్ చేయి చేసుకోవటం పరిణామాల తర్వాత ఫరా కాళ్ళబేరానికి రాక తప్పలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి హేపీ న్యూ ఇయర్ చేయటం, అది సూపర్ హిట్ కావటంతో ఫరా కెరీర్ మళ్ళీ గాడిలో పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close