గ్రామ సచివాలయ ఉద్యోగాలభర్తీపై నీలినీడలు..! పేపర్ లీకయిందా..?

ఆంధ్రజ్యోతి పత్రిక… ఏపీ ప్రభుత్వ నిజాయితీని మరోసారి గట్టిగా ప్రశ్నించింది. ఇరవై లక్షల మంది యువత .. ఎన్నో ఆశలు పెట్టుకుని రాసిన .. సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకయిందని… బ్యానర్ ఐటమ్‌గా… భారీ సాక్ష్యాలతో ప్రచురించింది. అలజడి రేపే కథనం ఇది. పది రోజుల్లోనే పరీక్ష ఫలితాలు ప్రకటించామని.. జగన్మోహన్ రెడ్డి .. ఉద్యోగుల్ని అభినందించారు. అయితే.. అర్హులకే.. ఉద్యోగాలు అందుతున్నాయా.. లేదా అనే పర్యవేక్షణను మాత్రం ఆయన చేయలేకపోయారు. ఆంధ్రజ్యోతి పత్రిక కథనంలో.. తీసి పారేయాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు. సచివాలయ ఉద్యోగ పరీక్షల పేపర్ సెట్టింగ్ చేసిన ఏపీపీఎస్సీలో ఉద్యోగులే.. పరీక్ష రాశారు. వాళ్లే టాప్ ర్యాంకర్లు అయ్యారు. అంటే.. పేపర్ అక్కడే లీక్ అయిందని అర్థం.

అంతే కాదు.. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ రిటైర్డ్ అధికారి చేతికి… పరీక్ష పేపర్ ముందుగానే వెళ్లిందని.. అక్కడ్నుంచి అస్మదీయులందరికీ… చేరిపోయిందని… ఆంధ్రజ్యోతి కథనంలో సారాంశం. జనరల్ విభాగంలో టాపర్లను .. పరిశీలిస్తే… దాదాపుగా అందరూ ఒకే సామాజికవర్గం వారున్నారు. ఇది కూడా అనుమానాలను తావిచ్చేదిలా ఉందని.. ఆంధ్రజ్యోతి కథనానికి బలం చేకూరుస్తుందన్న అభిప్రాయం.. పరీక్ష రాసిన వారిలో ఏర్పడుతోంది. కొన్ని రోజుల క్రితం… చిత్తూరు జిల్లాలో ఓ మంత్రి పేరు చెప్పుకుని రూ. ఐదు లక్షలకు పేపర్ అమ్ముకున్నారన్న ప్రచారమూ జరిగింది. ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.

గతంలో తెలంగాణలో… ఎంసెట్ మెడికల్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని బయట పెట్టింది.. ఆంధ్రజ్యోతినే. ఓ చిన్న ఆధారాన్ని పట్టుకుని… రోజుల తరబడి కథనాలు ప్రచురించడంతోనే… ఆ స్కామ్ బయటకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి తెలిసే జరిగిందని ఆరోపణలు ఉన్నప్పటికీ… ఆంధ్రజ్యోతి కథనాలతో విచారణ జరగక తప్పలేదు. ఆ కేసు ఇప్పటికి ఏమయిందో తెలియలేదు కానీ.. మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు.. సచివాలయ ఉద్యోగ పరీక్షల విషయంలో.. ఏపీ సర్కార్ ఏం చేయబోతోందో మరి.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు...

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

HOT NEWS

[X] Close
[X] Close